అరె.. మ‌హేష్ అలాంటి నిర్ణ‌యం ఎందుకు తీసుకున్న‌ట్టు?

అన్నీ మ‌న అనుభ‌వంలోకి వ‌చ్చిన త‌ర్వాతే డిసైడ్ అవ్వాల్సిన ప‌నిలేదు. కొన్ని ప‌క్క‌వాళ్ల‌ను చూసి కూడా నేర్చుకోవ‌చ్చు. మ‌రి ఈ మాట మ‌హేష్‌కి తెలియ‌దా? తెలిస్తే అంత పెద్ద త‌ప్పు ఎందుకు చేస్తాడు? అని అనుకుంటున్నారంతా. ఇంత‌కీ మ‌హేష్ చేసిన త‌ప్పేంట‌నుకుంటున్నారా? అప్ప‌ట్లో ప్ర‌భాస్ చేసిందే!
డీటైల్డ్‌గా చ‌దివేయండి.

బాహుబ‌లి సినిమాకు రాజ‌మౌళికి ఏళ్ల‌కు ఏళ్లు కాల్షీట్ ఇచ్చేశాడు ప్ర‌భాస్‌. ఆ సినిమా రెండు పార్టులూ పెద్ద హిట్ అయి, ప్యాన్ ఇండియా రేంజ్‌లో మ‌నిషిని నిల‌ప‌బ‌ట్టి స‌రిపోయింది. లేకపోతే ప‌రిస్థితి ఏంటి? ఈ మ‌ధ్య ట్రిపుల్ ఆర్‌కి అటు తార‌క్‌, ఇటు చ‌ర‌ణ్ ఇద్ద‌రూ ఇలాగే చేశారు. కాక‌పోతే రామ్‌చ‌ర‌ణ్ మ‌ధ్య‌లో ఆచార్య ప్రొడ‌క్ష‌న్ ప‌నులు, ఆచార్య యాక్టింగ్ అంటూ కాస్త టైమ్ తీసుకున్నాడ‌నుకోండి.


ఏదేమైనా, ఇప్పుడు ఆ ముగ్గురు హీరోల‌ని ఫాలో అవ్వాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌. ఇమీడియేట్‌గా మాట‌ల మాంత్రికుడి ముందు యస్ బాస్ అన‌బోతున్న మ‌హేష్‌, ఆ త‌ర్వాత మాత్రం రాజ‌మౌళి సినిమా కోసం కాల్షీట్లు అలాట్ చేశాడు. రాజ‌మౌళి సినిమా అన‌గానే ఎన్నాళ్లు? అని అడ‌గ‌డం మానేసి అంద‌రూ ఎన్నేళ్లూ అని అడుగుతున్నార‌ట‌. అయినా ఆ స‌బ్జెక్ట్ కి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులూ అలాట్ చేస్తాను. ఇంకే స‌బ్జెక్ట్ అయినా, దాని త‌ర్వాతే. ముందు అది పూర్త‌యితేనే నెక్స్ట్ సినిమా మాట‌లు అని అంటున్నాడ‌ట మ‌హేష్‌.


ఇప్ప‌టికైతే స‌రిలేరు నీకెవ్వ‌రు, స‌ర్కారువారి పాట సినిమాల‌తో స‌క్సెస్ మీదున్నాడు సూప‌ర్‌స్టార్‌. త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్‌ది ఎటూ క్రేజీ ప్రాజెక్టే. సో దాని తర్వాత మ‌హేష్ సినిమా ఏంట‌న్న‌ది ఇప్ప‌ట్లో చెప్ప‌లేం అనుకుంటున్నారు ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు.