వెంకటేష్-నాని మల్టీస్టారర్ ఆల్మోస్ట్ కన్ఫమ్!

టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే కథానాయకుడు విక్టరీ వెంకటేష్. ఇక.. ఈ తరంలో వైవిధ్యభరితమైన కథలకు పెద్ద పీట వేస్తూనే.. మల్టీస్టారర్స్ విషయంలోనూ తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పే టాలెంటెడ్ యాక్టర్ నాని. ఈ విలక్షణ నటులు ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే.. ఆ సినిమా ఓ రేంజులో ఉంటుంది. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబోనే సెట్ చేస్తున్నాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

‘గుంటూరు కారం‘ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే.. ఆ చిత్రం ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. అది పూర్తవ్వడానికి ఎలాగైనా సంవత్సర కాలం పడుతుందట. దీంతో.. తన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్న ఓ మల్టీస్టారర్ స్టోరీని బయటకు తీసి.. దానికి ట్రీట్ మెంట్ రెడీ చేస్తున్నాడట మాటల మాంత్రికుడు. ఈ మూవీలో నటించడానికి నేచురల్ స్టార్ నాని ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంకటేష్ మాత్రం కాస్త సందిగ్దంలో ఉన్నాడట. గతంలో వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి‘ వంటి సినిమాలలో తన పెన్ పవర్ చూపించాడు త్రివిక్రమ్. అయితే.. వెంకీని డైరెక్ట్ చేయడం మాత్రం ఇదే తొలిసారి. మొత్తంమీద.. వెంకటేష్-నాని లతో త్రివిక్రమ్ క్రేజీ మల్టీస్టారర్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.

Related Posts