అర్జున్ రెడ్డి బ్యూటీ నుంచి అనూహ్యమైన సినిమా

అర్జున్ రెడ్డి చాలాయేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన పాథ్ బ్రేకింగ్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ క్రేజీ స్టార్ అయిపోతే దర్శకుడు కూడా నేషనల్ వైడ్ గా అదే కథతో ఫేమ్ అయ్యాడు. కానీ సినిమాలో బోల్డ్ గా నటించిన హీరోయిన్ షాలిని పాండేకు మాత్రం ఆ స్థాయిలో గుర్తింపు తేలేకపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసినా అవేవీ పెద్దగా ఆడలేదు. దీంతో అమ్మడు మకాంను బాలీవుడ్ కు మార్చింది. అక్కడ ప్రతిష్టాత్మక ఆఫర్స్ అందుకుంది అని చెప్పారు. కానీ కొన్నాళ్లుగా ఆ సందడిఏం కనిపించలేదు. బట్ లేటెస్ట్ గా తను బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్ వీర్ సింగ్ సరసన నటించిన మూవీ ట్రైలర్ తో ఆశ్చర్యపరిచింది.

రణ్ వీర్ సింగ్ సరసన ఆఫర్ అంటే నేరుగా టాప్ లీగ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం వచ్చినట్టు. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తే అలాగేం కనిపించడం లేదు. ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదూ.. జయేష్ భాయ్ జోర్దార్. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎంటర్టైనర్ లా కనిపిస్తోందీ చిత్రం. అన్నిటికంటే ముఖ్యంగా రణ్ వీర్ సింగ్ లుక్ చూస్తే షాక్ అవుతాం. ఓ గ్రామ పెద్ద కొడుకుగా అతను నటించాడు. అతని తర్వాత కొడుకును గెలిపించుకోవలనుకుంటాడు. కానీ అతను తనంత సమర్థుడు కాదనీ.. పెళ్లి చేసి ఓ మనవడిని కనమని చెబుతాడు. కానీ మొదటి కాన్పులో అమ్మాయి పుడుతుంది. అప్పటి నుంచి షాలినీ పాండే ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారీ స్కానింగ్ చేయించడం.. అమ్మాయి అనితెలిస్తే అబార్షన్ చేయాలని ప్రయత్నించడం చేస్తుంటారు.

అవేవీ ఇష్టం లేని భార్యా భర్తలు తను ప్రెగ్నెంట్ గా ఉండగానే కూతురుతో కలిసి పారిపోతారు. మళ్లీ వెదికి వెనక్కి తెస్తాడు అతని తండ్రి. ఆ క్రమంలో జయేష్ రంజన్ కూతురుగా చాలా హుషారుగా ఉండటం.. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ హిలేరియస్ గా వర్కవుట్ కావడం చూస్తోంటే ఇదో కొత్త కంటెంట్ తో వస్తోన్న సినిమా కాకపోయినా.. ఖచ్చితంగా అలరించబోతోందని చెప్పొచ్చు.
ఇక ప్రెగ్నెంట్ లేడీగా షాలిటీ చాలా బావుంది. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రలా కనిపిస్తోంది. మరి ఈ మూవీ హిట్ అయితే ఈ లిప్ లాక్ ల భామకు బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ పెరుగుతాయని చెప్పొచ్చు. అన్నట్టు ఈ చిత్రం ఈ యేడ�