యూట్యూబ్ ని షేక్ చేయనున్న ట్రైలర్స్

రాబోయే ఆరు రోజుల్లో యూట్యూబ్ ని షేక్ చేయడానికి టాలీవుడ్ నుంచి ట్రైలర్స్, టీజర్స్ రెడీ అవుతున్నాయి. జనవరి 3న విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్‘ మూవీ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘సైంధవ్‘ విడుదలకు ముస్తాబవుతోంది. ఈమధ్య ట్రెండింగ్ గా మారిన ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ సినిమా రూపొందింది. వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్ఠాత్మక 75వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు.

జనవరి 3న ‘సైంధవ్‘ ట్రైలర్ వస్తుంటే.. జనవరి 6న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం‘ ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘గుంటూరు కారం‘పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సంక్రాంతి బరిలో రాబోతున్న క్రేజీయెస్ట్ మూవీ ఇది. ఒక్కసారి ‘గుంటూరు కారం‘ ట్రైలర్ రిలీజైతే.. యూట్యూబ్ షేక్ అవ్వడం ఖాయం.

‘గుంటూరు కారం‘ ట్రైలర్ వచ్చిన రెండు రోజులకు ‘దేవర‘ ఆగమనం ఉండబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ ‘దేవర‘ గ్లింప్స్ ను జనవరి 8న రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన సినిమాగా ‘దేవర‘ రూపొందుతోంది. ఈ సినిమాతో ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే సన్నాహాల్లో ఉన్నాడు డైరెక్టర్ కొరటాల. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర‘ ఫ్రాంచైస్ లోని ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది.

Related Posts