ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డేట్ ఇదే..

రాజమౌళి డైరెక్షన్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. రౌద్రంరణం రుధిరం అంటూ రాబోతోన్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గణ్, అలియాభట్ వంటి వారితో సినిమా విజువల్ గా కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని ఆల్రెడీ విడుదలైన పాటలు, టీజర్స్ చెబుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న విడుదల కాబోతోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ను ఈ నెల 3న విడుదల చేస్తామని ప్రకటించాడు రాజమౌళి. బట్ నవంబర్ 30న తెలుగు సినిమా గ్రేట్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో ట్రైలర్ విడుదలను వాయిదా వేశారు. దీంతో ఈ ట్రైలర్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఉసూరుమన్నారు. అలాగే కొత్త ట్రైలర్ రిలీజ్ డేట్ కోసం కూడా చూస్తున్నారు.
ఇక పోస్ట్ పోన్ అయిన ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే అంశంలో ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. ఈ నెల 6న అల్లు అర్జున్ పుష్స ట్రైలర్ విడుదలవుతోంది. ఆ తర్వాత మూడు రోజులకు వీరి ట్రైలర్ రిలీజ్ చేస్తారట. అంటే ఈ నెల 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల కాబోతోంది. సో.. చెప్పిన టైమ్ కు ఒక వారం ఆలస్యంగా ఈ విజువల్ గ్రాండియర్ మూవీ ట్రైలర్ వస్తోందన్నమాట. మరి ఈ ట్రైలర్ చూస్తే సినిమా రేంజ్ ను కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి చాలా నమ్మకంగా ఉన్నాడు. చాలామంది ఊహించిన దానికన్నా భిన్నమైన కథనంతో మెస్మరైజ్ చేయబోతున్నాడని టాక్. ఆ విషయం ట్రైలర్ లోనే అర్థమయ్యేలా కట్ చేయించారట. అలాగే సినిమాలో ఆర్ఆర్ ఏ రేంజ్ లో ఉండబోతోందనేది కూడా ఈ ట్రైలర్ తో హింట్ ఇవ్వబోతున్నారంటున్నారు. మరి వారు పెంచుతోన్న అంచనాలు అలాగే ఉంటాయా లేదా అనేది ఈ నెల 9న విడుదల కాబోతోన్న ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

Related Posts