ఏపీలో థియేటర్ల తనిఖీలు, ఎగ్జిబిటర్లు ఆగ్రహం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అన్ని సినిమాల‌కు టిక్కెట్ల రేటు ఓకేలా ఉండేలా ప్ర‌భుత్వం జీవో తీసుకురావ‌డం.. నిర్మాత‌లు భారీ చిత్రాల‌కు టిక్కెట్లు రేటు పెంచునేలా అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేయ‌డం తెలిసిందే. అయితే.. ప్ర‌భుత్వం ఎంత‌కీ దిగి రాక‌పోవ‌డంతో సినీ ప్ర‌ముఖులు కోర్టును ఆశ్ర‌యించ‌డం జ‌రిగింది. కోర్టు భారీ చిత్రాల‌కు రేటు పెంచుకునేలా ఆదేశాలు ఇవ్వ‌డం జ‌రిగింది. కోర్టు ఆదేశాలతో రానున్న‌ భారీ చిత్రాల‌కు ఊర‌ట ల‌భించింది అనుకుంటే.. ప్ర‌భుత్వం ఇప్పుడు థియేట‌ర్ల‌ను త‌నీఖీ చేస్తూ స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌డం లేదంటూ థియేట‌ర్ల‌ను సీజ్ చేస్తుంది.

విజయవాడలో విస్తృతంగా తనిఖీలు జ‌రుగుతున్నాయి. పీవీఆర్ మల్టీప్లెక్స్, అప్సర, అలంకార్, శైలజ, క్యాపిటల్ సినిమాస్ అన్నపూర్ణ థియేటర్లల్లో విస్తృత తనిఖీలు కొనసాగాయి. సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అవన్నీ సక్రమంగా పని చేస్తున్నాయా? లేదా? అనేది ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. థియేటర్లల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్‌, క్యాంటీన్‌లను తనిఖీ చేశారు. అమ్మకానికి ఉంచిన ఆహార పదార్థాల నాణ్యత, ప్యాకేజింగ్‌ను పరిశీలించారు.

వాటి రేట్ల గురించి ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. 20/-రు ఖరీదు చేసే బాటిల్ 50/- రు అమ్ముతున్నానట్లు గుర్తించారు. అయితే… సినిమా థియేటర్లలో తనిఖీల పై ఎగ్జిబిటర్ల ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. రేపు విజయవాడలో సమావేశం కావాలని నిర్ణయించ‌కున్నారు. థియేటర్లలో తనిఖీలు, సీజ్‌, ప్రభుత్వం తీరు పై చర్చించనున్నారు. మ‌రి.. ఎగ్జిబిట‌ర్లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.