సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేతిలో తెలుగు ‘భ్రమయుగం’

ఈ మధ్య కాలంలో పరభాషా చిత్రాల్లో విపరీతంగా క్యూరియాసిటీ పెంచిన సినిమా ‘భ్రమయుగం’. మమ్ముట్టి మెయిన్ లీడ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. రాహుల్‌ సదాశివన్ డైరెక్షన్‌లో నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్‌ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. భ్రమయుగం సినిమాను తెలుగు ప్రేక్షకులకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అందించనుంది.


మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి నటీనటులు కూడా అద్భుతంగా నటించి మెప్పించిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు వెండితెరపై ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ‘లియో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని విడుదల చేసిన సితార సంస్థ.. ఇప్పుడు ‘భ్రమయుగం’ తెలుగు వెర్షన్ ను ఫిబ్రవరి 23న విడుదల చేస్తోంది.

Related Posts