ప్రభాస్ కోసం టాల్ హీరోయిన్ ఫిక్స్

డార్లింగ్ స్టార్ ప్రభాస్ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కానీ అతనికి ఓ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ విషయంలో రీసెంట్ గా ఓ కన్ఫ్యూజన్ రావడంతో ప్రభాస్ నిర్ణయం మార్చుకుంటాడా అనుకున్నారు. ఇంకా చెబితే మార్చుకుంటే బావుంటుంది అని అతని ఫ్యాన్స్ చాలా చాలా కోరుకున్నారు కూడా. కానీ డార్లింగ్ తన డెసిషన్ మార్చుకోలేదు. అందుకు నిదర్శనం లేటెస్ట్ గా అతని సరసన హీరోయిన్ ను కూడా సెలెక్ట్ చేయడమే. ఇంతకీ ఇదంతా ఏ నిర్ణయం గురించీ.. ఆ హీరోయిన్ ఎవరూ అనే కదా మీ డౌట్..మాస్ హీరోగా తిరుగులేని క్రేజ్ ఉన్న ప్రభాస్ కు.. బాహుబలితో ప్యాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చేసింది. ఆ ఇమేజ్ ను ఎంజాయ్ చేస్తూనే మరింత పెంచుకునేలా కొత్త సినిమాల ప్లానింగ్ కనిపిస్తోంది. రాధేశ్యామ్ నిరాశపరిచినా.. ఈ రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేసిందే అనే భావనలో ఉన్నారు అతని ఫ్యాన్స్. బట్ రాబోయే సినిమాలైన ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె డార్లింగ్ ను వాల్డ్ వైడ్ గా హాట్ ఫేవరెట్ చేస్తాయి అనే అంచనాలున్నాయి. ఇంత పెద్ద సినిమాలు చేస్తోన్న అతను సడెన్ గా మారుతితో ఓ ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యాడనే న్యూస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.

కారణమేంటో అందరికీ తెలుసు. ఇక మారుతి రీసెంట్ మూవీ పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అనిపించుకుంది. అంతేకాక మారుతి డైలాగ్ లు, టేకింగ్ పైనా విమర్శలు వచ్చాయి. దీంతో ఇక ఈ కాంబోలో సినిమా ఉండదు అనే అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ ఒకటి తలిస్తే ప్రభాస్ మరోటి తలిచాడు.ప్రభాస్ – మారుతి కాంబోలో సినిమా ఖచ్చితంగా ఉండబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అంటున్నారు. అందులో భాగంగానే డార్లింగ్ తో రొమాన్స్ చేసే బ్యూటీని సెలెక్ట్ చేశారు. తనెవరో కాదు.. చాలా రోజుల క్రితం విజయ్ దేవరకొండతో పరిచయం కావాల్సిన మాళవిక మోహనన్. ఈ మళయాలీ భామ ఇప్పటికే తమిళ్ లో టాప్ స్టార్స్ సరసన నటించింది. ఆ సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ తో మనవారికీ పరిచయం అయింది. ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ ఈ టాల్ బ్యూటీనే చెప్పింది. రాజా డీలక్స్ అనే టైటిల్ తో రాబోతోన్న ఈ మూవీ హారర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఆ రాజా డీలక్స్ ఓనర్ గా ప్రభాస్ కనిపిస్తాడు అనే ప్రచారం జరుగుతోంది. మరి రాజా డీలక్స్ తో ప్రభాసేమో కానీ.. మారుతి ఎలా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి.