నాగ చైతన్యకు సూపర్ ఛాన్స్..

సినిమా మేకింగ్ తో పాటు రిలీజ్ టైమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు టైమ్ బాలేకపోతే మంచి సినిమాలు కూడా పోతాయి. అందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. అందుకే రిలీజ్ డేట్ అనేది రిజల్ట్ పైనా ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం టైమ్ బలే కలిసొస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వీక్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తాయి. బట్.. పాజిటివ్ వైబ్స్ తో, అటు టైమూ కలిసొచ్చినట్టుగా కనిపిస్తోన్న సినిమా థ్యాంక్యూ. నాగచైతన్య నటించిన ఈ మూవీ ఈ ఛాన్స్ ను వాడుకుంటుందా..?ఏ సినిమాకైనా పోటీ ఉంటే ఆడియన్స్ కు మజా వస్తుంది. లేకపోతే నిర్మాతకు ప్లస్ అవుతుంది. అలాగని అస్సలు కాంపిటీషనే ఉండదు అని కాదు. బట్.. ఉన్న సినిమాల్లో పెద్ద సినిమాగా వస్తే మాత్రం ఆప్షన్ ఈ మూవీకే ఎక్కువగా ఉంటుంది. అలాంటి బెస్ట్ ఆప్షన్ తోనే వస్తోంది నాగ చైతన్య థ్యాంక్యూ మూవీ. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీ ఈ నెల 22న విడుదల కాబోతోంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో ప్రామిసింగ్ అనిపించుకుందీ మూవీ టీమ్.

ట్రైలర్ పూర్తి పాజిటివ్ వైబ్స్ తో చూడగానే ఓ సింపుల్ హార్ట్ టచింగ్ స్టోరీని చూడబోతున్నాం అనిపించేలా ఉంది. అటు పాటలు పెద్దగా రిజిస్టర్ కాకున్నా.. ఈ ట్రైలర్ తో ఎక్స్ పెక్టేషన్స్ పెంచాడు చైతూ.22న థ్యాంక్యూ కాకుండా మరో మూడు నాలుగు సినిమాలున్నాయి. కానీ వీటిలో ఏదీ పెద్దగా ఆకట్టుకునేది లేదు. ఉన్నంతలో అనసూయ, సునిల్ నటించిన దర్జా కాస్త తెలిసిన మూవీ. కానీ వీళ్లు ప్రమోషన్స్ ఏం చేయడం లేదు. ఇక మిగిలిన సినిమాల ట్రైలర్స్ చూస్తే చాలు.. వాటి స్టాండర్డ్ ఏంటో తెలియడానికి. విశేషం ఏంటంటే.. నాగ చైతన్యతో పాటు 22నే విడుదల అంటూ నిఖిల్ కార్తికేయ-2 ను అనౌన్స్ చేశారు. మరి ఏమైందో ఆ మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో చైతూకి ఇంకా పెద్ద అవకావం వచ్చింది. అలాగే ఇదే రోజున బాలీవుడ్ నుంచి రణ్ బీర్ కపూర్ నటించిన షంషేరా విడుదలవుతోంది. ఈ సినిమాకు థ్యాంక్యూను ఎఫెక్ట్ చేసేంత లేదు అని అందరికీ తెలుసు. పైగా ప్రమోషన్స్ కూడా లేవు. సో.. చైతూకి ఇది బెస్ట్ ఛాన్స్. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా హిట్ అయిపోతుంది.