సీతారామం.. వీళ్లు మ్యాజిక్ చేస్తారా.. ?

కొన్ని సినిమాలపై తెలియకుండానే ఓ రేంజ్ లో పాజిటివిటీ కనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఈ మధ్య బాగా చెప్పుకోదగ్గది సీతారామం. ఈ సినిమా టైటిల్ నుంచే చాలామందిని ఇంప్రెస్ చేసింది. మళయాలీ అయినా హీరోగా నటించిన దుల్కర్ సాల్మన్ కు ఎక్కడలేని క్రేజ్ కనిపిస్తోంది. ప్రమోషనల్ టూర్ లో దుల్కర్ క్రేజ్ చూసి మేకర్స్ కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ప్రభాస్ కూడా వచ్చేయడంతో అంచనాల పరంగానూ టాప్ ప్లేస్ లో ఉన్నారు. మరి సీతారామం ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అవుతుందా..?

1960ల నేపథ్యంలో సాగే కథ. ఆర్మీలో పనిచేసే లెఫ్టినెంట్ రామ్ అనాథ. ఎవరూ లేరని బాధపడుతోన్న అతనికి ఓ రోజు ఓ అమ్మాయి నుంచి ఉత్తరం వస్తుంది. పైగా తను అతని కోసం ఎదురుచూస్తున్నా అని చెబుతుంది. దీంతో ఆమెను వెదుకుతూ వెళ్లి, తను సీత అని తెలుసుకుని ప్రేమలో పడతాడు. కొన్నేళ్లు గడిచిపోయాక ఈ సీతారామం లను వెదుకుతూ మరో అమ్మాయి వస్తుంది. మరి ఈ గ్యాప్ లో వాళ్లేమయ్యారు. ఈ అమ్మాయి ఎవరు అనే క్వశ్చన్ మార్క్స్ ను ట్రైలర్ లో వదిలి ఇంప్రెస్ చేసి ఇంట్రెస్ట్ పెంచారు. ఈ బ్యాక్ డ్రాప్ లోనే అద్భుతమైన పాటలు, అందమైన నేపథ్యం, మంచి ప్రేమకథను మిక్స్ చేశారు. చూస్తున్న ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్వ్ కావడానికి ఇవి చాలు కదా.. ?

అయితే స్క్రీన్ ప్లే మాత్రం చాలా కీలకం.ఇప్పటి వరకూ వచ్చిన అప్డేట్స్ తో సీతారామం ఓ మంచి సినిమా అనే ఇంప్రెషన్ అందరిలోనూ ఉంది. హిట్టు బొమ్మా కాదా అనేది సినిమా వస్తే కానీ తెలియదు. ఇక దుల్కర్, మృణాళినీ జంట ఈ సినిమాకు పెద్ద ఎసెట్ గా కనిపిస్తుంది. రష్మిక మందన్న కీలక పాత్రగా సుమంత్, తరుణ్‌ భాస్కర్, వెన్నెల కిశోర్ సపోర్ట్ రోల్స్ లో ఉన్నారు. వీరి పాత్రలూ కీలకంగానే ఉంటాయి అని చెప్పారు. వీటికి మించి ఇలాంటి సెన్సిబుల్ కథలను చెప్పడంలో దర్శకుడు హను రాఘవపూడి బెస్ట్ అనిపించుకున్నాడు. అతని �