‘అద్దం’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో శ్రద్దాదాస్

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ మాయ అనే సైకియాట్రిస్ట్‌ (మానసిక వైద్య నిపుణురాలు) చుట్టూ తిరిగే కథతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమే “అర్థం”. మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ ప్రధాన పాత్రలో ‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్, అమని, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, సాహితి నటీ నటులుగా ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌ కథగా తెరకెక్కిన ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయ బోతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ మ్యూజికల్ టీజర్‌ సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా మ్యూజికల్ రైట్స్‌ని టిప్స్ ఫిల్మ్స్ & మ్యూజిక్ చేజిక్కించు కుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ చివరి వారంలో విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఒక ప్రముఖమైన హోటల్ లో చిత్ర టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దా దాస్ మాట్లాడుతూ:-ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమా నాకు స్పెషల్..ఇలాంటి హార్రర్ మూవీలకు వి. యఫ్. ఎక్స్ ఇంపార్టెంట్.డి ఓ పి పవన్ గారు నన్ను చాలా అందంగా చూయించారు. దర్శకుడు మణికాంత్ గారు, మరియు నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకేక్కించారు.ఈ మూవీ లో గ్లామర్ రోల్ లో సైకరియటిస్ట్ గా నటించాను. ఇందులోని నా పాత్ర చాలా కు స్పెషల్ గా ఉంటుంది.. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో మంచి టీం తో నటించడం చాలా హ్యాపీ గా ఉందని అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ:- ఇంతకుముందు నేను తీసిన నాటకం సినిమాకు అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. అందరూ బాగా సఫోర్ట్ చేశారు .వి. యఫ్ ఎక్స్ లో అనుభవం ఉన్న మణికాంత్ తన ప్రొఫెషన్ ను పక్కనపెట్టి డైరెక్టర్ కావాలనే ప్యాషన్ తో ఉన్న తను చెప్పిన సైకలాజికల్ థ్రిల్లర్ కథ నచ్చడంతో ఈ సినిమాను క