హిజ్ సో క్యూట్ హిజ్ సో స్వీట్ హిజ్ సో హ్యాండ్‌సమ్: రష్మిక మందన్న

“హిజ్ సో క్యూట్ హిజ్ సో స్వీట్ హిజ్ సో హ్యాండ్‌సమ్” అంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు ని క్యూట్ గా పొగిడింది హీరోయిన్ రష్మిక మందన్న. ఇదంతా ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటించిన ‘యానిమల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేశ్ బాబు, పాన్ ఇండియన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపి తమ స్పీచ్ లతో సినిమాపై భారీగా అంచనాలు పెంచారు.

ఈ సందర్భంగా రష్మిక మందన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి మాట్లాడింది. అలాగే, ఆయనతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘హిజ్ సో క్యూట్ హిజ్ సో స్వీట్ హిజ్ సో హ్యాండ్‌సమ్’.. సాంగ్ లైన్ ని చెప్పి మహేశ్ ని థ్రిల్ చేసింది. అలా అనగానే మహేశ్ రష్మికని తన కౌగిలిలోకి తీసుకొని నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.