‘పుష్ప 2’ ఐటెం సాంగ్ మరో లెవెల్

కొన్ని కాంబినేషన్స్ లో రూపొందే సినిమాలకు ప్రత్యేక గీతాలే ప్రధాన ఆకర్షణ. అలాంటి కాంబోస్ లో సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ కలయిక ఒకటి. ఈ జనరేషన్ లో ఐటెం సాంగ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే మూవీ ‘ఆర్య’. అల్లు అర్జున్ – సుకుమార్- దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలోని ‘అ అంటే అమలాపురం’ సాంగ్ సూపర్ హిట్టైంది. ఆ తర్వాత ‘ఆర్య-2’లో ‘రింగ-రింగ’తో మరో సూపర్ హిట్ ఐటెం నంబర్ అందించింది ఈ కాంబినేషన్. ‘ఆర్య, ఆర్య-2’ తర్వాత మూడోసారి ‘పుష్ప పార్ట్ 1’ కోసం బన్నీ-సుక్కూ-దేవిశ్రీ కలసి పనిచేశారు.

వీరి కాంబినేషన్ అంటేనే ఈ చిత్రంలో ఐటెం నంబర్ ఏ రేంజులో ఉండబోతుంది? అనే ఊహాగానాలు ఉంటాయి. వాటికి మించిన రీతిలో ‘పుష్ప‘ చిత్రంలోని స్పెషల్ ఐటెం నంబర్ ను తీర్చిదిద్దారు. ‘పుష్ప‘ పార్ట్ 1 లోని సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్సే. అయితే.. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా‘ అంటూ సమంత నర్తించిన స్పెషల్ సాంగ్.. పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించింది. టాలీవుడ్ లో ఐటెం నంబర్స్ కి ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చిన వీరు ‘పుష్ప‘ ఐటెం నంబర్ తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించారు. ఇప్పుడు ‘పుష్ప2‘ కోసం మరో సెన్సేషనల్ స్పెషల్ నంబర్ ను సిద్ధం చేస్తున్నారట.

‘పుష్ప‘ పార్ట్ 1లోని ఐటెం నంబర్ సూపర్ హిట్. దీంతో.. పార్ట్2 లోని స్పెషల్ సాంగ్ ను ఇంకా స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ క్రేజీ సీక్వెల్ లో స్పెషల్ నంబర్ కోసం మంచి ఊపిచ్చే మాస్ ట్యూన్ ని రెడీ చేశాడట రాక్ స్టార్ డి.ఎస్.పి. ఈ పాటలో ఐటెం క్వీన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ఈమె ప్రభాస్ ‘కల్కి 2898ఎడి’లో నటిస్తోంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోనే ఎక్కువ రోజులు ఉండబోతుంది. ఈనేపథ్యంలో.. ‘పుష్ప 2’లోని ఐటెం సాంగ్ కోసం దిశాని ఒప్పించే ప్రయత్నంలో ఉందట టీమ్.

Related Posts