పోలీస్, దొంగ, లవర్.. ఈ ముగ్గురిలో విన్నర్ ఎవరు

తెలుగు సినిమా సక్సెస్ రేట్ వార వారం తగ్గుతూ వస్తోంది. రావడానికి ప్రతి వారం ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ హిట్ టాక్ తెచ్చుకునే సినిమాలు కరవవుతున్నాయి. అయినా రిలీజ్ లు ఆగవు కదా. ఈ వారం కూడా చాలా సినిమాలే బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ అంతా మూడు సినిమాల మధ్యే కనిపిస్తోంది. అంటే ట్రైయాంగిల్ ఫైట్ అన్నమాట. సడెన్ గా ఎవరైనా ఆకట్టుకునే అవకాశం ఉందీ అనుకోవడానికి కూడా లేకుండా మిగతా సినిమాలు కనిపిస్తుండటమే.. పోటీ ఈ మూడు సినిమాల మధ్యే ఉండటానికి కారణం. మరి ఆ సినిమాలేంటీ.. ఈ ట్రైయాంగిల్ ఫైట్ లో విన్ అయ్యేదెవరు..?
కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథలే ఎంచుకుంటూ వెళుతున్నాడు శ్రీ విష్ణు. తన సినిమా హిట్ ఫట్టా అనేది పక్కన బెడితే.. కంటెంట్ మాత్రం కాస్త కొత్తగానే ఉంటుంది.

ఒక్కోసారి ఎగ్జిక్యూషన్ వల్ల ఫెయిల్ అవుతాయి కానీ ఓవరాల్ గా మంచి కథలే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా అల్లూరి అంటూ వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో పాటు పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఉన్న సినిమాల్లో కాస్త ఎక్కువమందిని ఆకట్టుకునే కెపాసిటీ అల్లూరికే కనిపిస్తోంది. అలాగని మిగతా సినిమాలను తక్కువ చేయలేం.శ్రీ విష్ణు లాగే డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటోన్న కొత్త హీరో శ్రీ సింహా కోడూరి. కీరవాణి తనయుడుగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలిలోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్ మూవీ మత్తు వదలరాతోనే మెప్పించిన శ్రీ సింహా తర్వాత తెల్లవారితే గురువారం అనే మూవీతోనూ ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాతో ఈ శుక్రవారం వస్తున్నాడు. సతీష్‌ త్రిపుర ఈ చిత్రానికి దర్శకుడు. ఓ హాలీవుడ్ మూవీకి రీమేక్ లా కనిపిస్తోన్న దొంగలున్నారు జాగ్రత్తలో ప్రీతి అస్రాని హీరోయిన్ సముద్రఖని కీలక పాత్ర పోషించాడు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే ఇదో డిఫరెంట్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది.

ఎప్పుడో కానీ హిట్ అనే మాట చూడని హీరో నాగ శౌర్య. వరుసగా సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ మాత్రం రావడం లేదు. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన కృష్ణ వృంద విహారిని ఈ 23 విడుదల చేస్తున్నారు. షిర్లే సేథియా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అనీష్‌ కృష్ణ దర్శకుడు. పాటలు, ట్రైలర్ ఓకే అనిపించేలా ఉన్నాయి. అయితే అల్లూరి, దొంగలున్నారు జాగ్రత్త సినిమాలతో కృష్ణ వృంద విహారికి గట్టి పోటీ ఉంటుంది. దాన్ని దాటుకుని ఆడియన్స్ ను మెప్పించగలిగితేనే విజయం. లేదంటే మరోసారి శౌర్యకు నిరాశ తప్పదు అనే చెప్పాలి. మొత్తంగా ఈ మూడు చిత్రాల మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. మరి ఈ ముగ్గురిలో ఆడియన్స్ హార్ట్స్ ను కొల్లగొట్టి బాక్సాఫీస్ విజేతలుగా నిలిచేదెవరో చూడాలి.

Related Posts