ఖుషీకి ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?

పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ ను చేసిన సినిమాల్లో ముందు వరుసలో ఉండే సినిమా ఖుషీ. తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రాన్ని అక్కడ విజయ్ హీరోగా చేశాడు. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించాడు. రెండు సినిమాలకూ దర్శకుడు ఎస్.జే. సూర్యనే.

రెండు చోట్లా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం విచిత్రంగా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్ బేస్ ను డబుల్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. తమిళ్ లో విజయ్, జ్యోతిక జంటగా నటించారు. తెలుగులో పవన్ సరసన భూమిక నటించింది. ఇక తెలుగులో ఈసినిమా కు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేశారు. కంప్లీట్ గా ఓ హిందీ పాటను పెట్టేశారు.

అలాగే పవన్ కళ్యాణ్ ఫైట్ మాస్టర్ గా చేశాడు. కానీ తమిళ్ లో ఫైట్స్ ఉండవు. కేవలం పవన్ ఇమేజ్ కోసం ఇక్కడ ఫైట్స్ యాడ్ చేశారు. పవన్, భూమికల జంటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ పాటలు మరో హైలెట్ గా నిలిచిన ఈ చిత్రానికి మొదట అనుకున్న టైటిల్ తెలుగులో అయితే ఖుషీ కాదు.

ఈ మూవీ వచ్చిన టైమ్ లో తెలుగులో విచిత్రమైన టైటిల్స్ వస్తున్నాయి. కథను పూర్తిగా తెలియజేసేలాంటి టైటిల్స్ అవి. అందుకే ఈ చిత్ర నిర్మాతలు, దర్శకుడు కూడా అలాంటి టైటిల్ తోనే వెళ్లాలనుకున్నారు. ఇక సినిమా పరంగా హీరో హీరోయిన్ ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ విషయాన్ని ఒకరికి ఒకరు చెప్పాలనుకుంటారు. కానీ ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ అవుతుంది. దీంతో పోస్ట్ పోన్ అవుతుంది. అలాగే ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు కూడా జరుగుతుంటాయి. మరోవైపు ఇద్దరికీ ఓ రేంజ్ లో ఈగో ఉంటుంది. ఇవన్నీ దాటుకుని తమ ప్రేమను చెప్పాలని ఉంది అని మనసులో అనుకుంటుంటారు. అందుకే అదే టైటిల్ గా పెట్టాలనుకున్నారు. ‘‘చెప్పాలని వుంది’’ ఇదే ఖుషీ మూవీకి మొదటగా అనుకున్న టైటిల్. నిజానికి ఆసినిమా చూసిన ఎవరికైనా అప్పటి ట్రెండ్ తెలిసి ఉంటుంది కదా.. ఈ కథను బట్టి ఆ ట్రెండ్ లో వెళితే ఈ టైటిల్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేది. కానీ దర్శకుడి సూచన మేరకు యూనిక్ గా ఉండే టైటిల్ ఉండాలని ఖుషీని ఫిక్స్ చేశారు. అలా చెప్పాలని ఉంది కాస్తా ఖుషీ అయింది.. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి సినిమా తీసినవారికి నటించిన వారికి అంతులేని ఖుషీనిచ్చింది.

విశేషం ఏంటంటే.. చెప్పాలని వుంది అనే టైటిల్ ను ఆ తర్వాత చంద్ర మహేష్ డైరెక్షన్ లో వడ్డే నవీన్ హీరోగా నటించిన చిత్రానికి పెట్టారు. ఈ మూవీలో నవీన్ సరసన రాశి హీరోయిన్ గా నటించింది. అలా చెప్పాలని ఉంది కాస్తా ఖుషీ అయింది.. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి సినిమా తీసినవారికి నటించిన వారికి అంతులేని ఖుషీనిచ్చింది. బట్ ఈ సినిమా పోయింది.