ఎన్టీఆర్ – కొరటాల ప్రాజెక్ట్ ఆగిపోయిందా..?

ఒక సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ మరో సినిమాపై ఖచ్చితంగా పడుతుంది. లేదని ఎవరైనా అంటే కాదు అని చెప్పడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాంటి ఉదాహరణల్లోకి తాజాగా మరోటి చేరింది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆలస్యం అంటే అందులోనూ అసలు లేకపోవచ్చు అనే మాట వస్తే ఇంక చెప్పేదేముందీ.. యస్.. చాలామంది ఊహించినట్టుగానే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో సినిమా ఆగిపోయినట్టే న్యూస్ వస్తున్నాయి. అలాగని పూర్తిగా కాదు. ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు అంటున్నారు. అందుకు కారణం ఆచార్య ఫ్లాప్ అని అంతా అనుకున్నా.. అది కేవలం ఒక రీజనేనట. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆగిపోవడానికి మరో ప్రధానమైన కారణం కూడా ఉందంటున్నారు. అదే కథ.
ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల ఆత్మరక్షణలో పడిపోయాడు. అలాంటి డిజాస్టర్ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా అంటే అంచనాలు వేరే లెవల్లో ఉంటాయి. పైగా ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ తో ఎక్కువ లాభపడింది లేదు. అంటే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లోనూ ఎక్స్ పెక్టేషన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. వాటిని అందుకోవాలంటే ఇప్పుడు తను రాసుకున్న కథ సరిపోకపోవచ్చు అనుకుంటున్నాడట కొరటాల. అందుకే తనే ఎన్టీఆర్ ను టైమ్ అడిగాడు.. కథను మరింత ఇంప్రవైజ్ చేయడానికి అనే న్యూస్ కూడా వచ్చాయి. కానీ నిజానికి ఎన్టీఆర్ కు ఇప్పటి వరకూ పూర్తి స్క్రిప్ట్ వినిపించలేదట కొరటాల. తను చెప్పిన లైన్ తో పాటు కొన్ని సీక్వెన్స్ లు మాత్రమే నచ్చాయట. అయినా కొరటాలపై నమ్మకంతో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. కానీ ఆచార్య రిజల్ట్ చూసిన తర్వాత అటు ఎన్టీఆర్ కూడా అంతా అనుకున్నట్టుగానే ఆలోచనలో పడిపోయాడంటున్నారు. సో.. ఇటు కొరటాల కోరాడో లేదో కానీ.. ఎన్టీఆర్ మాత్రం బౌండ్ స్క్రీప్ట్ తో వస్తే తనకు నచ్చితే ఓకే అన్నాడని టాక్.
మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా కాస్త ముందుకు వచ్చిందంటున్నారు. రీసెంట్ గా తమ మ్యారేజ్ డే రోజున ఈ ఇద్దరూ కలిశారు. కానీ ఆ కలవడం వెనక ప్రాజెక్ట్ కు సంబంధించి డిస్కషన్స్ అనేదే మెయిన్ ఎజెండా అంటున్నారు. పైగా ప్రశాంత్ నీల్ ఏకంగా ఎన్టీఆర్ కు లుక్ టెస్ట్ చేశాడని కూడా చెప్పుకుంటున్నారు. లుక్ వరకూ వచ్చాడంటే అతని వద్ద కథ ఖచ్చితంగా ఉన్నట్టే అనేది కొందరి వాదన. ఏదేమైనా ముందు ఎన్టీఆర్- కొరటాల ప్రాజెక్ట్ కు సంబంధించి అసలు ఉందా లేదా అనే వార్త వారి నుంచే అఫీషియల్ గా వచ్చే వరకూ ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి.