ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్ లో వచ్చే సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ ఆదరణ ఉంటుంది. కంటెంట్ బావుంటే ఖచ్చితంగా సూపర్‌హిట్ స్కోప్ ఉంటుంది. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. ఇప్సుడు ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో రాబోతున్న మూవీ హద్దులేదురా.. ఈ మూవీకి ట్యాగ్‌లైన్‌గా ఫ్రెండ్‌షిప్ అని పెట్టారు. ఇది చిన్న సినిమా అయినా సురేష్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థకు నచ్చడం మా మొదటి విజయం అంటున్నారు చిత్ర మేకర్స్. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్‌కి అన్ని వర్గాలనుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఆశీష్ గాంధీ, అశోక్, వర్ధ, హ్రితిక మెయిన్ లీడ్‌తో వస్తున్న ఈ మూవీ ని రాజశేఖర్ రావి డైరెక్ట్ చేసారు. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్ బ్యానర్స్ పై వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. రావి మోహన్ రావు సహా నిర్మాత.
గతంలో నాటకం టీజర్ ఇదే వేదిక మీద లాంచ్ అయ్యింది. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు హద్దులేదురా టీజర్ కూడా ఇదే వేదిక మీద లాంచ్ అయ్యింది. ఈ సినిమా కూడా మంచి హిట్ కాబోతుందన్నారు హీరో ఆశీష్‌గాంధీ. ఔట్ పుట్ అద్భుతంగా వచ్చిందనీ, కో ఆర్టిస్ట్స్ అందరూ బాగా యాక్ట్ చేసారన్నారు.
ఇద్దరు ఫ్రెండ్స్ కృష్ణార్జునుల మాదిరిగా.. వారికి వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కొన్నారనే కంటెంట్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ కమల్ కుమార్ ఐదు అద్భుతమైన పాటలిచ్చారు. పదివేలు సహాయం చేయడానికే ఆలోచించే ఈ రోజుల్లో మీ సినిమా కోసం నేనున్నానంటూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పాటలిచ్చిన కమల్‌కుమార్ .. ప్రస్తుతం మనమధ్య లేరు.. భౌతికంగా ఆయన లేకున్నా ఆయనిచ్చిన పాటలు మాత్రం శాశ్వతం అవుతాయని ఎమోషనల్ అయ్యారు డైరెక్టర్ రాజశేఖర్ రావి.
మిగతా ఆర్టిస్ట్‌లు, ఆతిధులు ఈ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ.. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.