‘అంటే.. సుందరానికి‘ అంటూ విలక్షణమైన టైటిల్ తో హిట్ కొట్టిన నాని-వివేక్ ఆత్రేయ.. ఇప్పుడు ‘సరిపోదా శనివారం‘ అంటూ మరో విభిన్నమైన టైటిల్ తో వస్తున్నారు. ‘సరిపోదా శనివారం‘ నుంచి వచ్చే శనివారం ఓ క్రేజీ అప్డేట్ రాబోతుంది. వచ్చే శనివారమే (ఫిబ్రవరి 24) ఈ అప్డేట్ రావడానికి ముఖ్య కారణం.. ఆరోజు నాని పుట్టినరోజు కావడం.
డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ‘సరిపోదా శనివారం’ ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొట్టింది. ఈ చిత్రం ప్రొడక్షన్ లో ఉండగానే.. డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ ఆఫర్ కు దక్కించుకుందట నెట్ ఫ్లిక్స్. ఒకవిధంగా నాని కెరీర్ లో ఇదే హయ్యస్ట్ డిజిటల్ డీల్ అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తంగా.. విడుదలకు ముందే సేఫ్ జోన్ లోకి వెళ్లిన ప్రాజెక్ట్ గా నాని ‘సరిపోదా శనివారం’ మిగలబోతుంది. ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. విలన్ గా ఎస్.జె.సూర్య కనిపించబోతున్నాడు.