టాలీవుడ్ స్టార్స్ ని చుట్టేసిన నెట్ ఫ్లిక్స్ సీ.ఈ.ఓ

ప్రస్తుతం అంతటా డిజిటల్ మీడియాదే హవా. శాటిలైట్, థియేటర్లకు దీటుగా ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కి ఇండియా అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్ ను మరింత విస్తరించేందుకు ఇప్పుడు ఇండియాలో విహరిస్తున్నాడు నెట్ ఫ్లిక్స్ సీ.ఈ.ఓ టెడ్ సరండోస్. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ‘ది ఆర్చీస్’ స్ట్రీమింగ్ కోసం ముంబై వచ్చాడు టెడ్. ఇక.. ముంబై తర్వాత ఇండియన్ సినీ ఇండస్ట్రీకి అతిపెద్ద మార్కెట్ గా అవతరించింది హైదరాబాద్. అందుకే వెంటనే హైదరాబాద్ లో వాలిపోయాడు. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరినీ వరుస పెట్టి చుట్టేస్తున్నాడు.