#NBK107 టైటిల్ అక్టోబర్ 21న విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ ప్రాజెక్ట్ NBK107 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్‌ తో సినిమా అంచనాలు మరింత భారీగా పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లోని ఆర్‌ ఎఫ్‌ సిలో జరుగుతోంది.ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది.NBK107 టైటిల్‌ ని అక్టోబర్ 21న విడుదల చేయనున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని టైటిల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే మేకర్స్ ఖరారు చేసిన అసలు టైటిల్ ఏంటో మరో ఐదు రోజుల్లో తెలియనుంది.