మెగాస్టార్ గారూ.. మీరూ.. మీ తీరూ మారాలి సర్..?

అది వయసు మళ్లిన హీరోలు కూడా ఇంకా ఒకటో నెంబర్ బస్సు, వందనం అభివందనం అంటూ ప్రేమకథా చిత్రాలు చేస్తూ.. నటిస్తోన్న కాలం. కొత్తతరం కూడా వచ్చింది. కానీ ఎవరూ అంతగా ఆకట్టుకోవడం లేదు.. ఆకట్టుకున్నా.. అది నిలకడగా మెయిన్టేన్ చేయడంలో తడబడుతున్నారు. అలాంటప్పుడు ఓ కుర్రాడు వచ్చాడు. తన సినీ జీవితానికి పునాదిరాళ్లు వేసుకుని.. సినిమాకు తన ప్రాణాన్నే ఖరీదుగా పెట్టి ‘కళ్ల’తోనే మాయ చేసి.. ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. నలుగురిలో ఒకడుగా మొదలై.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ‘‘ఆ నలుగురు’’హీరోల్లోనే నెంబర్ వన్ అనిపించుకున్నాడు.

1983లో వచ్చిన ఖైదీతో ఇతనే తెలుగు సినిమా ఫ్యూచర్ స్టార్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత అతను లక్షలాది ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ అయ్యాడు. అభిమానులు పెరిగారు. ఆదరణ పెరిగింది. దీనికి తోడు హీరోకు సంబంధించి అతనో మెరుపు వేగం చూపించాడు. ఫైట్స్, డ్యాన్స్ ల్లో అప్పటి వరకూ చూడని ఓ గ్రేస్ ను యాడ్ చేశాడు. ఆ గ్రేస్ కు నాటి ఆంధ్రలోకం పడిపోయింది.. ఆ గ్రేస్ వల్లే ఆయన్ని బాస్ గా భావించింది. ఎదిగిన కొద్దీ ఒదుగుతూ.. తెలుగు సినిమా కమర్షియల్ స్టాండర్డ్స్ ను ఎల్లలు దాటించాడు. కమర్షియల్ సినిమాకు కరెక్ట్ పర్సన్ తనే అని అంతా అనుకునేలా చేశాడు. అతను కాలు కదిపితే కాసుల వర్షం. ఫ్లాప్ సినిమా సైతం నిర్మాతలకు నష్టాలు తేని వైనం. వెరసి తెలుగు సినిమాకు ఎన్టీఆర్, కృష్ణ తర్వాత మాస్ హీరోగా మారాడు. 80ల సగం నుంచి 95ల వరకూ బిగ్గెస్ట్ హిట్స్ తో బిగ్గర్ దన్ బిగ్ బి అని బాలీవుడ్ కూడా రాసుకునేలా చేసిన ఆ ఛరిష్మా పేరు చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి.

బిగ్గర్ దన్ బిగ్ బి అన్న పేరు వచ్చిన తర్వాత కాస్త అహం కూడా యాడ్ అయిందో లేక.. మరేంటో కానీ కథలు గాడి తప్పాయి. వరుస ఫ్లాపులు. చిరంజీవి పనైపోయింది అన్నారు. ఆ మాట ఒక్కో సినిమాకూ పెరుగుతూ వెళ్లింది. దీంతో తనను తాను సరిదిద్దుకున్నాడు. గ్యాప్ తీసుకున్నాడు. ఇమేజ్ ను దాటి హిట్లర్ లా మారాడు. దాదాపు యేడాది గ్యాప్ తర్వాత చేసిన ఈ సినిమా సూపర్ హిట్. మళ్లీ కొత్త ఇన్నింగ్స్ మొదలు. మెగాస్టార్ అంటే మా మాస్టరే అని మళ్లీ ఫ్యాన్స్ కాలర్ ఎత్తారు. ఆ కాలర్ ను దించకుండానే వెళ్లాడు. మళ్లీ పొలిటికల్ గ్యాప్. ఎవరో చెప్పిన మాటలు విని నిజమే అనుకున్నాడు. వేటూరి చెప్పినట్టు… బృందావనంలో కృష్ణుడులా వెలిగిన వాడు.. రాజకీయ కారడివికి వెళ్లాడు. నమ్మిన వాళ్లు ముంచారు. లేదా తన అనుయాయుల వల్ల అభిమానులు హర్ట