మేజర్ ట్రైలర్ టాక్ – ఎక్స్ ల్లెంట్ విత్ ఎమోషన్స్ అండ్ యాక్షన్

మేజర్.. అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేసిన సినిమా. అందుకు కారణం.. 26/11 అటాక్స్ లో ఎంతోమంది ప్రాణాలు కాపాడి.. అవసరమైతే నా ప్రాణాలను ఇస్తాను కానీ.. దేశాన్ని కాదు అని నినదించి మరణించిన వీర జవాన్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా వస్తోన్న చిత్రం కావడం ఒకటైతే.. ఇలాంటి సినిమాలతో అద్భుతమైన విజయాలు సాధిస్తోన్న మనతెలుగు స్టార్ అడవి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించడం వంటి వన్నీ కలిసి మేజర్ సినిమాను మొదటి నుంచీ ఆడియన్స్ మైండ్ లోనే ఉండేలా చేశాయి. ఇక లేటెస్ట్ గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ను మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.

ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ చెబుతోన్న మాట ఒక్కటే.. ఎక్స్ ల్లెంట్ అని. నిజంగానే ఇలాంటి ట్రైలర్ ను కట్ చేయడం కత్తిమీద సాము లాంటిది. కానీ అటు పేరెంట్స్ ఎమోషన్స్ ను, ఇటు సందీప్ లోని దేశభక్తితో పాటు ఆ రోజు జరిగిన అటాక్స్ ను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సస్ అయ్యారు. మామూలుగా ఆర్మీ నేపథ్యంలో సినిమా అంటే అందులో దేశభక్తికి సంబంధించి డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలుస్తాయి. కానీ అవేవీ లేకుండానే ఓ అద్భుతమైన సినిమాను చూడబోతున్నాం అనే ఫీ�