కార్తికేయ నిర్మాణంలో తెలుగులోకి మలయాళం బ్లాక్ బస్టర్

రాజమౌళి తనయుడిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఎస్.ఎస్.కార్తికేయ. రాజమౌళి చిత్రాలకు సంబంధించి డైరెక్షన్ డిపార్ట్ మెంట్, ప్రొడక్షన్, పబ్లిసిటీ అన్ని వ్యవహారాలను చక్కబెడుతుంటాడు కార్తికేయ. తండ్రి రాజమౌళి సినిమాలకే కాదు ఇప్పుడు తను కూడా ప్రత్యేకంగా కొన్ని చిత్రాలను ప్రేక్షకులకు అందించే పనిలో పడ్డాడు.

లేటెస్ట్ గా మలయాళం బ్లాక్ బస్టర్ ‘ప్రేమలు’ చిత్రాన్ని తెలుగులో అనువదించే పనిలో ఉన్నాడట కార్తికేయ. మార్చి 8న ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదలకానున్నట్టు తెలుస్తోంది. ఫహాద్ ఫాజిల్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నెల్సన్ కె.గఫూర్, మమిత బైజు లీడ్ రోల్స్ పోషించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ‘ప్రేమలుమాలీవుడ్ ని ఊపేస్తోంది.

ఈ సినిమాకోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ఈ మూవీ ఆద్యంతం హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రూపొందడమే. ఈమధ్య కాలంలో హైదరాబాద్ ని ఈ సినిమాలో చూపించినంత అందంగా మరో చిత్రంలో చూపించలేదనే ప్రశంసలు వస్తున్నాయి.

Related Posts