లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో‘జిగర్ తండా 2’

వెర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్న చిత్రం ‘జిగర్‌తండా 2’ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ తెలియ‌జేశారు. 2014లో ఆయ‌న రూపొందించిన యాక్ష‌న్ కామెడీ జిగ‌ర్ తండా బేస్డ్‌గా ‘జిగర్‌తండా 2’ రూపొంద‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న‌ట్లు కార్తీక్ సుబ్బ‌రాజ్ పేర్కొన్నారు.

యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ‘జిగర్ తండా 2’లో రాఘవ లారెన్స్, ఎస్‌.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. దీన్ని భారీ బ‌డ్జెట్‌తో స్టోన్ బెంచ్ బ్యాన‌ర్‌పై కార్తికేయ‌న్ సంతానం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందించ‌నున్నారు.

2014లో కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ట్ చేసిన‌ జిగ‌ర్‌తండా పంథాలో జిగ‌ర్‌తండా 2 కూడా యాక్షన్ గ్యాంగ్‌స్టర్ జోనర్‌లోనే తెర‌కెక్క‌నుంది.

ఇంత‌కు ముందు కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మెర్క్యురీ, సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ పేట్ట స‌హా ప‌లు చిత్రాల‌కు అద్బుత‌మైన విజువ‌ల్స్ అందించిన నే�