నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఇంటర్వ్యూ

మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ”ధమాకా’.  కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్  గ్రాండ్ గా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధమాకా’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ధమాకా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నేపధ్యంలో నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ చిత్ర విజయాన్ని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.  

ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కంగ్రాట్స్
థాంక్స్ అండీ

ధమాకా ఫస్ట్ డే ఎలా వుంది ?
చాలా బావుందండీ. గ్రాండ్ గా ఓపెనింగ్స్ వచ్చాయి. అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది.

ధమాకా ప్రాజెక్ట్ ఎలా కుదిరింది ?
దర్శకుడు త్రినాథరావు, రచయిత ప్రసన్న కథ చెప్పారు. ఇది రవితేజ గారికి బావుంటుందని అనుకున్నాం. రవితేజ గారికి నచ్చింది. తర్వాత కథపై పని చేయడం మొదలుపెట్టాం. కోవిడ్ తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్ళాం.

పీపుల్స్ మీడియాలో ఇదే పెద్ద బడ్జెట్ ప్రాజెక్ట్ నా ?
ఇంతకుముందు వెంకీ మామ సినిమాని కూడా సిమిలర్ బడ్జెట్ లోనే చేశాం.

ధమాకా పాటల కోసం భారీ సెట్స్ వేశారు కదా ?
అవునండీ. ధమాకా లో సాంగ్స్ ప్రధానమైనవి. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. రవితేజ గారు శ్రీలీల డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థియేటర్స్ ప్రేక్షకులు రెస్పాన్స్ అద్భుతంగా వుంది. ఎక్స్ టార్డినరీగా ఎంజాయ్ చేస్తున్నారు. బీ సీ సెంటర్ల రెస్పాన్స్ మేము ఊహించాం. మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుండి మేము ఊహించిన దానికంటే ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ప్రాజెక్ట్ లో రవితేజ గారి కోపరేషన్ ఎలా వుంది ?
రవితేజ గారు ఎక్స్ టార్డినరీ పర్సన్