ఇషా చావ్లా సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది.. హీరో రాజ్ బాల


 లవ్ భూమ్,7 to 4, చిత్రం X, సినిమాలలో హీరోగా నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు రాజ్ బాల. తాజాగా మెగా ఫిలిమ్స్ నిర్మించే ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలో హీరో గా నటిస్తున్నాడు. ఈషా చావ్లా హీరోయిన్. ఈ నెల 17 న రాజ్ బాల పుట్టినరోజు సందర్బంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

మాది ప్రకాశం జిల్లా గిద్దరూరు యడవల్లి గ్రామం మా నాన్న ఆర్ టి సి కండక్టర్ నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ఎంతో ఇష్టం. నా డిగ్రీ అనంతరం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో థియేటర్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను.ఆ తరువాత సినిమాలలో నటించాలని ప్రయత్నం చేస్తున్న టైమ్ లో డైరెక్టర్ కరుణాకరన్ గారు “ఎందుకంటే ప్రేమంటే” సినిమాలో చిన్న రోల్ ఇచ్చారు.ఆ తరువాత తొంగి తొంగి చూడమాకు చందమామ”, “అంతకుమించి” వంటి సినిమాలు చేస్తున్న టైమ్ లో డైరెక్టర్ నగేష్ నారాదాసి గారు “లవ్ బూమ్” సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు.
 ఈ సినిమా తరువాత విజయ్ శేఖర్ సంక్రాంత్రి దర్శకత్వంలో నేను హీరోగా చేసిన “7 to 4” సినిమాబిగ్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా అడ్వాన్స్ కథ తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులనుండి, ఇండస్ట్రీ నుండి నాకు మంచి గుర్తింపు లభించింది.ఇప్పట్లో రిలీజ్ అయితే ఇప్పటి ఓటిటి ట్రెండ్ కు కరెక్ట్ సెట్ అయ్యేది .అలాగే కరోనా టైమ్ లో రిలీజ్ అయిన రమేష్ విభూది డైరెక్షన్ లో వచ్చిన “చిత్రం X” సినిమా కూడా నాకు చాలా మంచి గుర్తింపు లభించింది.
ఈ పది సంవత్సరాలు జర్నీ లో నేను ఆర్టిస్ట్ గా, నటుడుగా, హీరోగా ఇలా ఎన్నో ఒడి దుడుకులు ఎదురైనా నేను చేసే ప్రతి పనికి,సినిమాకు ఫలితం ఎక్స్పెక్ట్ చేయకుండా ముందుకు వెళితే ఫలితం దానంతటదే వస్తుంది అనేదే నా కాన్సెప్ట్. ప్రస్తుతం నేను చాలా హ్యాపీ గా ఉన్నాను. ఎందుకంటే ప్రకాశం జిల్లాలోని ఒక మారు మూల గ్రామం నుంచి వచ్చి ఇన్ని సినిమాలలో హీరోగా చేయగలిగే స్థాయికి వచ్చాను అంటే నాకు దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ అనుకుంటున్నాను.


 ప్రస్తుతం