“నేను మీకు బాగా కావాల్సినవాడిని” హీరోయిన్ ఇంటర్వ్యూ

లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి బ్యానర్ లో వస్తున్న “నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రంలో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను…హీరోయిన్ సోను ఠాగూర్ ఇంటర్వ్యూ.ఈ నెల 9 న “నేను మీకు బాగా కావాల్సినవాడిని” గ్రాండ్ రిలీజ్.కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం “నేను మీకు బాగా కావాల్సినవాడిని”.ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు.

‘SR కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన లాయర్ పాప.. లవ్ జైల్లో ఉన్న..బెయిల్ ఇచ్చి పోరాదే..పాట,“నచ్చావ్ అబ్బాయి” వంటి పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా ఈ చిత్రంలో సెకండ్ లీడ్ రోల్ లో నటించిన సోను ఠాగూర్ పాత్రికేయులతో మాట్లాడుతూ.

చిన్నప్పటి నుండి నాకు సినిమా అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఆ తరువాత నేను మోడల్ గా కేరీర్ ప్రారంభించాను. మోడలింగ్ చేస్తున్న టైమ్ లోనే “జోరుగా హుషారుగా” సినిమాలో ఒక మంచి సాంగ్ చేసే అవకాశం వచ్చింది. అందులో పాటకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.మొదట మంచి బ్యానర్ గానీ లేక మంచి కాస్ట్ గానీ , మంచి స్క్రిప్ట్ ఉ