ఆర్ఆర్ఆర్ వచ్చిన బజ్ ను మళ్లీ తెచ్చుకునేదెలా..?

ఆర్ఆర్ఆర్.. నో డౌట్ దేశం మొత్తం ఈ చిత్రం కోసం ఎదురుచూసేలా చేశారు. సినిమా మేకింగ్ లో ఉన్నప్పుడు తెలుగు ఆడియన్సెస్ మాత్రమే ఆసక్తిగా ఉన్నారు. బట్.. టీజర్ తో పాటు ట్రైలర్ వచ్చాక కంట్రీ మొత్తం క్యూరియాసిటీతో ఈ మూవీవైపు చూసింది. దీనికి కారణం రాజమౌళి అయినా.. తర్వాత ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో దేశాన్ని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అన్ని పెద్ద నగరాలు తిరుగుతూ మెయిన్ టీమ్ చేసిన హడావిడీకి గతంలో బాహుబలిలాగానే ఈ చిత్రం చూడకపోతే సినిమా ఫ్యాన్ అని చెప్పుకోవడం వేస్ట్ అని ప్రతి ఒక్కరూ ఫీలయ్యేలా చేశారు. ఇందుకోసం రాజమౌళితో పాటు చరణ్, ఎన్టీఆర్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు. ప్రమోషన్స్ కోసమే ఏకంగా ఇప్పటి వరకూ 40కోట్ల వరకూ ఖర్చు చేశారు. తీరా చూస్తే అనూహ్యంగా సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది.
ఆర్ఆర్ఆర్ కు ప్రమోషన్స్ వల్ల భారీ హైప్ వచ్చింది. సడెన్ గా వాయిదా వేయడం వల్ల అదంతా పోతుంది. మరి మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారో ఇప్పుడు చెప్పలేదు కానీ.. ఎప్పుడు రిలీజ్ చేసినా మళ్లీ ప్రమోషన్స్ చేయడం కుదురుతుందా.. కుదిరినా మళ్లీ ఇంత హైప్ తీసుకురావడం సాధ్యమేనా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ముందుండే ఉత్సాహం తర్వాత ఉండదు. అలాగని రాజమౌళిని తక్కువ అంచనా వేయడానికి లేదు. కాకపోతే ముందే మొత్తం చెప్పేశారు. ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పటికే అంతా చెప్పారు. మరి మరోసారి ప్రమోషన్ అంటే అప్పటికి ఈ ఇద్దరు హీరోల డేట్స్ ఎలా ఉంటాయి..? మళ్లీ పాత విషయాలే ఇంత ఎనర్జిటిక్ గా, డీటెయిల్డ్ గా చెబితే జనానికి నచ్చుతుందా అనేది చెప్పలేం. మొత్తంగా ఆర్ఆర్ఆర్ టీమ్ సినిమా వాయిదా వేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని కూడా చంపేసింది. మళ్లీ దాన్ని బతికించడం అంత సులువైతే కాదు.