‘గుంటూరు కారం‘ సాంగ్.. మాస్ స్టెప్స్ తో కుమ్మేసిన మహేష్

టాలీవుడ్ లో చాలామందే డ్యాన్సింగ్ స్టార్స్ ఉన్నారు. అయితే.. ఆ లిస్టులో మనకు మహేష్ బాబు కనిపించడు. చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్టుగా డ్యాన్సుల్లో ఇరగదీసిన మహేష్.. పెద్దైన తర్వాత డ్యాన్సులపై అంతగా ఆసక్తి కనబర్చలేదు. తన డైలాగ్స్, స్టైల్, స్వాగ్, ఫైట్స్ వంటి వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అయితే.. లేటెస్ట్ గా ‘గుంటూరు కారం‘లో స్టెప్స్ లో ఇరగదీసినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా రిలీజైన ‘కుర్చీ మడతపెట్టి‘ గీతంలో మాస్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు.

లేడీ డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల తో కలిసి ఈ పాటలో మహేష్ వేసిన మాస్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతికి థియేటర్లలో ఈ పాటకు విజిల్సే విజిల్స్. ‘రాజమండ్రి రాగమంజరి.. మా అమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రి.. కళాకారుల ఫ్యామిలీ మరి.. నేను గజ్జె కడితే నిదురపోదు నిండు రాతిరి..‘ అంటూ శ్రీలీల మాస్ అవతార్ లో రెచ్చిపోతే.. ‘సోకులాడి స్వప్న సుందరి.. నీ మడత చూపు మాపటేల మళ్లె పందిరి.. ‘ అంటూ మ..మ.. మాస్ అవతార్ లో మహేష్ ఈ పాటలో మరింత రెచ్చిపోతున్నాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ మాస్ గీతాన్ని సాహితీ చాగంటి, శ్రీకృష్ణ ఆలపించారు. తమన్ సంగీతాన్నందించిన ఈ మెంటల్ మాస్ సాంగ్.. ట్రెండింగ్ లోకి దూసుకెళ్లడం ఖాయం.

Related Posts