యాంకర్ సుమ ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం

యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియం లో ఉచిత ఐ క్యాంప్ గ్రాండ్‌ గా లాంచ్ అయ్యింది. దాదాపు పది రోజుల పాటు సాగే ఈ కంటి చికిత్సా శిబిరంలో తెలుగు సినీ టీవి అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఐ క్యాంప్‌ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
కంటి వైద్యం చేయించుకోవాలని ఎదురుచూస్తున్న వారికి ఈ ఐ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ శ్రీనివాస్ గారు, ప్రదీప్ గారు, విజయ భాస్కర్ గారికి, శంకర నేత్రాలయ వారికి, మనకు ఇష్టమైన యాంకర్ మాత్రమే కాదు మనకు ఇష్టమైన చెల్లెమ్మ సుమ గారికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.


మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ యూఎస్ లో ఉన్న తెలుగు అసోసియేషన్స్ లో అతి తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి చేరువైన సంస్థ మాది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ 3 వేల మంది సభ్యులతో ప్రారంభించాం. అక్కడ అనేక రాష్ట్రాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కువ ఆర్భాటాలకు పోకుండా వీలైనంత మందికి సేవ చేయాలని అనుకుంటున్నామన్నారు సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్‌. సుమ గారు లేకుంటే మేము ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేయగలిగేవాళ్లం కాదన్నారాయన.
ఐ క్యాంప్ లో పాల్గొనేందుకు వచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు యాంకర్ సుమ కనకాల. శంకర్ నేత్రాలయ వారితో ఈ ఐ క్యాంప్ నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంది. తెలుగు సినీ, టీవీ అసోసియేషన్ వారు తమ సహకారం అందిస్తున్నారు. జుబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ కూడా తమ వంతు హెల్ప్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఐ క్యాంప్ ను సినీ, టీవీ అసోసియేషన్ లోని సభ్యులంతా వినియోగించుకోవాలని కోరుతున్నా అన్నారు సుమ కనకాల.
ఈ కార్యక్రమంలో రాజీవ్‌ కనకాల. తెలుగు సినీ, టీవీ ఫెడరేషన్ అధ్యక్షులు రాకేశ్ పాల్గొని కంటి చికిత్స శిబిరంలో పా‌ల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసారు నిర్వాహకులు.

Related Posts