అసలు ఈ టైగర్ నాగేశ్వరరావు ఎవరో తెలుసా..?

టైగర్ నాగేశ్వరరావు.. ప్రస్తుతం సినిమా సర్కిల్స్ లో హాట్ గా వినిపిస్తోన్న పేరు. మాస్ మహరాజ్ రవితేజ ఈ పాత్ర చేస్తున్నాడు. ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈమూవీ ఓపెనింగ్ కు హాజరయ్యాడు. అంతేకాక ఓపెనింగ్ నే ఓ రేంజ్ లో భారీగా ఖర్చు పెట్టి మరీ నిర్వహించాడు నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఈ మొత్తం అంశాలతో టైగర్ నాగేశ్వరరావు టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. అయితే ఓ చిన్న పట్టణానికి చెందిన వ్యక్తి కథలో సినిమాగా నిర్మించేంత స్టఫ్ ఎలా వచ్చింది..? అనే ఆసక్తి అందర్లోనూ ఉంది. మరి ఈ నాగేశ్వరరావు ఎవరు.. అతనికి టైగర్ అన్న పేరు ఎలా వచ్చింది..?
నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒకప్పటి ప్రకాశం జిల్లాలోని చీరాల ప్రాంతానికి చెందిన వ్యక్తి. స్టూవర్ట్ పురం బ్యాచ్ అన్నమాట. అక్కడి నుంచే అతను దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఎక్కువగా రైళ్లలో దోచుకునేవాడు. ఓ దొంగకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది అంటే చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. నాగేశ్వరరావు కేవలం దొంగ మాత్రమే కాదు.. రాబిన్ హుడ్ లాంటి వాడు. తను దోచుకున్నదాన్ని పేదలకు పంచేవాడు. అప్పట్లో ఎండాకాలంలో నిరుపేదల గుడిసెలు ఎక్కువగా తగలబడుతూ ఉండేవి. అలాంటి సందర్భాల్లోనే గ్రామాల్లోని గుడిసెలను ఇతనే వేయించేవాడు అని చెబుతారు. ఈ కారణంగానే అతనికి ఆ ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో తిరుగులేని పట్టు ఉండేది. ఇంట్లోనే ఉన్నా.. పోలీస్ లు ఎంత వేధించినా ఎవరూ అతని గురించి చెప్పేవారు కాదు.
మరో విశేషం ఏంటంటే.. నాగేశ్వరరావు అత్యంత వేగంగా పరుగు తీయగలడు. పోలీస్ జీప్ కూడా అతని వేగాన్ని అందుకోలేదు. ఆ స్థాయిలో పరుగులు తీయడం అంటే చిన్న విషయం కాదు కదా.. అలాగే అతన్లాంటి మరే దొంగకూ లేని మరో ప్రత్యేకత కూడా ఉంది. తను ఎక్కడ ఏ టైమ్ లో దొంగతనం చేయబోతున్నాడో ముందే పోలీస్ లకు చెప్పేవాడట.. అంటే దమ్ముంటే పట్టుకోండి అనే సవాల్ విసిరేవాడని అర్థం. అన్నీ తెలిసినా.. ఎంత తెలివిగా ప్లాన్ చేసుకున్నా… అతన్ని పోలీస్ లు పట్టుకోలేకపోయేవారు. అఫ్ కోర్స్ అతనికీ పోలీస్ ల్లో కోవర్ట్ లు ఉండేవారు. ఆ డిపార్ట్ మెంట్ లో ఉన్న పేదవారికి కూడా సాయం చేశాడట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే.. అతన్ని టైగర్ అని ముద్దుగా పిలుచుకున్నారు స్థానిక ప్రజలు. చాలాసార్లు జైళ్ల నుంచి కూడా తప్పించుకున్నాడు. ఏమైతేనేం.. ఎన్నో యేళ్ల పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ ను ముప్పుతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు చివరికి ఆ పోలీస్ చేత