బన్నీతో ఫాహద్‌ మీట్‌ అయ్యేది ఎప్పుడో తెలుసా

ఎస్పీ భన్వర్‌సింగ్‌ షెకావత్‌గా పుష్ప సినిమాలో మెప్పించారు మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కే పుష్ప సినిమాలో విలన్లుగా నటిస్తారంటూ స్టార్టింగ్‌లో చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్‌గా ఫాహద్‌కి ఓటేశారు సుకుమార్‌. పుష్ప ఫస్ట్ పార్ట్ అనుకున్నప్పుడు అందులో జస్ట్ క్లైమాక్స్ లో ఒకే ఒక సీన్‌లో విలన్‌ కనిపిస్తారని రాసుకున్నారట సుకుమార్‌. కానీ ఫాహద్‌తో తెరకెక్కించిన సన్నివేశాలు చూసిన తర్వాత అప్పటికప్పుడు స్క్రీన్‌ప్లే మార్చి భన్వర్‌సింగ్‌ కేరక్టర్‌ లెంగ్త్ పెంచారు.పార్టీ లేదా పుష్పా అనేది ఇప్పుడు మోస్ట్ యూజేస్‌లో ఉన్న కాయినింగ్‌.

ఈ ఒక్క డైలాగ్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్‌ అయిపోయారు ఫాహద్‌. పుష్ప ది రూల్‌లో ఫాహద్‌ విశ్వరూపం చూస్తారని ఆయనే ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. అసలు ఎవరూ ఊహించనంత గొప్పగా తన పాత్ర ఉంటుందన్నది ఫాహద్‌ చెప్పిన విషయం. ఆల్రెడీ కొన్ని సీన్లు షూట్‌ అయిపోయిందట. ఈ నెల ఫస్టాఫ్‌లోనే పుష్ప సీక్వెల్‌ సెట్స్ మీదకు వెళ్తుంది. డిసెంబర్‌లోపు ఈ సినిమాకు సంబంధించి ఫాహద్‌ పార్ట్ పూర్తి చేసేలా ప్లాన్‌ చేశారట సుకుమార్‌.

డిసెంబర్‌ తర్వాత ఫాహద్‌ తమిళ సినిమాతో బిజీగా ఉంటారు. విజయ్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్‌ డిసెంబర్‌ నుంచి మొదలవుతుంది. అందులో ఫాహద్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. విక్రమ్‌ సినిమాలో ఆల్రెడీ లోకేష్‌తో కలిసి పనిచేశారు ఫాహద్‌. ఇప్పుడు మరోసారి అసోసియేట్‌ కావడానికి రెడీ అవుతున్నారు. సో డిసెంబర్‌కి పుష్ప పనులు పూర్తి చేసి, విజయ్‌ సినిమా సెట్‌కి వెళ్లాలన్నది ఫాహద్‌ ప్లాన్‌. ఒకవేళ బన్నీ కాంబినేషన్లో కొంత పార్ట్ ఏదైనా మిస్‌ అయితే జనవరి ఆఖరున జరిగే షెడ్యూల్లో జాయిన్‌ అయి కంప్లీట్‌ చేస్తారు ఫాహద్‌.