“పుష్ప” పార్ట్ 2 గురించి సుకుమార్ ఏమ‌న్నారో తెలుసా.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో చాలా హాడావిడిగా రిలీజ్ చేశారు. ప్ర‌మోష‌న్స్ చేయ‌డానికి కూడా టీమ్ ద‌గ్గ‌ర టైమ్ లేదంటే.. ఎంత టెన్ష‌న్ ప‌డుతూ రిలీజ్ చేశారో అర్థం చేసుకోవ‌చ్చు. డైరెక్ట‌ర్ సుకుమార్ అయితే.. ప్రీ రిలీజ్ ఫంక్స‌న్ కి కూడా రాలేదు. అయితే.. ఈ సినిమా బిగ్ స‌క్స‌స్ సాధించ‌డంతో ప‌డిన టెన్ష‌న్ అంతా పోయింద‌ని చెప్ప‌చ్చు. అంచ‌నాల‌కు మించిన స‌క్స‌స్ ను పుష్ప సాధించింది.

దీంతో ఇప్పుడు పుష్ప పార్ట్ 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఎప్పుడెప్పుడు పుష్ప పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు డైరెక్ట‌ర్ సుకుమార్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా పుష్ప పార్ట్ 2 గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఇంత‌కీ సుకుమార్ ఏం చెప్పారంటే… పుష్ప 2 లో మొదటి పార్ట్ కన్నా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయని అలాగే సునీల్ మరియు అనసూయ పాత్రలకు సంబంధించి కూడ మరింత ఎక్కువ స్కోప్ ఈ పార్ట్ లో కనిపిస్తుంది అని తెలిపారు.

ఇక ఈ సినిమాని వచ్చే ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలియ‌చేశారు. పార్ట్ 2 కోసం ఇంత‌కు ముందు కొంత పార్ట్ షూటింగ్ చేయ‌డం జ‌రిగింది. అయితే.. దానిని ప‌క్క‌న పెట్టి ఫ్రెష్ గా షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నాం. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే.. మళ్లీ డిసెంబర్ నాటికి పుష్ప పార్ట్ 2 రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. బాలీవుడ్ లో పుష్ప పార్ట్ 1 ఇప్ప‌టి వ‌ర‌కు 80 కోట్లు క‌లెక్ట్ చేసింది. మ‌రి.. పుష్ప పార్ట్ 2 ఇంకెంత క‌లెక్ట్ చేస్తుందో చూడాలి.

Related Posts