రాశిఖన్నాకు ఆఫర్స్ ఎలా వస్తున్నాయో తెలుసా..?

హీరోయిన్లకు విజయాలు చాలా కీలకం. స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్ గా విజయాలు సాధిస్తూనే ఉండాలి. లేదంటే ఐరన్ లెగ్ అంటారు. తనుంటే సినిమా ఫట్అంటూ సెంటిమెంట్ డైలాగులు చెబుతుంటారు. ఒక్కోసారి వరుస ఫ్లాప్ లు వచ్చినా కొందరు హీరోయిన్లకు ఆఫర్స్ ఆగవు. అందుకు కారణాలు చాలానే ఉంటాయి. అలాంటి బ్యూటీస్ లో ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తోన్న సోయగం రాశిఖన్నా. 2019తర్వాత ఒక్క హిట్టూ లేకపోయినా అమ్మడికి ఆఫర్స్ తగ్గలేదు. అందుకు కారణమేంటో తెలుసా..?ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరను తాకిన సోయగం రాశిఖన్నా.

అందంతో పాటు ప్రతిభా తన సొంతం. పైగా చాలా తక్కువ టైమ్ లోనే తనే తెలుగులో డబ్బింగ్ చెప్పడం నేర్చుకుంది. అప్పటి నుంచి జోరుగా దూసుకురాలేకపోయినా.. అప్పుడప్పుడూ జిల్ మనిపిస్తూ.. సుప్రీమ్ హిట్లూ కొడుతూ వస్తోంది. బట్ ఎప్పుడూ వరుస విజయాలు సాధించలేదు తను. కొన్ని సినిమాల విజయాల్లో తన పాత్ర ఎవరికీ గుర్తు కూడా లేదు. అయినా తొలిప్రేమ లాంటి సినిమాలో బలమైన నటనతో తన ముద్రను చూపుకుంటూ వస్తోంది. 2019లో వచ్చిన ప్రతి రోజూ పండగే తర్వాత రాశికి విజయాలే లేవు. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ అలాగే ఉంది పరిస్థితి. రీసెంట్ గా వచ్చిన పక్క కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి. అయినా తనకు మరో కొత్త సినిమా వచ్చింది.

వరుసగా రెండు సినిమాలు పోయినా లేటెస్ట్ గా రాశిఖన్నా మరో సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ సోమవారమే ప్రారంభం అయింది. శర్వానంద్ హీరో. రౌడీఫెలో వంటి మంచి సినిమా డైరెక్ట్ చేసిన లిరిసిస్ట్ కమ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య రూపొందిస్తోన్న సినిమా ఇది. మాస్ ఎంటర్టైనర్ గా రాబోతోంది. అయితే రాశికి ఆఫర్స్ రావడం వెనక టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాక్స్ ఉన్నాయి. తన నేచర్ అందరికీ నచ్చుతుందట. అందరితోనూ బాగా కలిసిపోతుంది. పైగా రెమ్యూనరేషన్ పరంగా భారీ డిమాండ్స్ ఉండవు. ప్రమోషన్స్ లోనూ యాక్టివ్ గా ఉంటుంది. తనే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇలాంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి రాశికి కంటిన్యూస్ ఆఫర్స్ తెస్�