“ఆర్ఆర్ఆర్” చూసి ఎంతసేపట్లో బయటకొస్తారో తెలుసా

ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు సినీ అభిమానుల నోట్లో బాగా నానుతున్న మూవీ టైటిల్ ఇదే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు. ఈరోజు ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఎన్ని అంచ‌నాల‌తో వ‌చ్చినా అంత‌కు మించి ఆర్ఆర్ఆర్ ఉంటుంద‌ని అనే న‌మ్మ‌కాన్ని ట్రైల‌ర్ క‌లిగించింది.

ఇదిలా ఉంటే.. ఈ భారీ సినిమా టోటల్ రన్ టైం ఎంత అనేది బయటకు వచ్చింది. ఇంత‌కీ ఎంతంటే.. మొదటి నుంచి వినిపించినట్టుగానే ఈ సంచ‌ల‌న చిత్రం ర‌న్ టైమ్ 3 గంటలకు పైనే ఉన్నట్టుగా సెన్సార్ బోర్డ్ ద్వారా తెలిసింది. ఇంకా చెప్పాలంటే.. ఈ చిత్రం మొత్తం 3 గంటల 6 నిమిషాల 54 సెకండ్లు వచ్చిందట. అలాగే సెన్సార్ బోర్డ్ వారు ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు కూడా తెలిసింది.

రాజ‌మౌళి సినిమా ర‌న్ టైమ్ 3 గంట‌లే కాదు 5 గంట‌లు ఉన్నా చూస్తారు. ఎందుకంటే.. ఆయ‌న టేకింగ్, యాక్ష‌న్ ఎపిసోడ్స్, ఎమోష‌న్ అంత‌లా ఆడియ‌న్స్ ని క‌ట్టిప‌డేసాలా ఉంటాయి. అందుచేత 3 గంట‌ల‌కు పైగా ర‌న్ టైమ్ ఉన్నా ఏం ఫ‌ర‌వాలేదు అని అంద‌రి నోట వినిపిస్తుంది. బాహుబ‌లి రికార్డుల‌ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేయ‌డం ఖాయం అనే టాక్ బ‌లంగా ఉంది. మ‌రి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజ‌మౌళి మ‌రోసారి చ‌రిత్ర సృష్టిస్తారేమో చూడాలి.

Related Posts