హంట్ టైటిల్ పై వివాదం

శ్రీ క్రియేషన్స్ పతాకం పై నిక్షిత్ హీరోగా దర్శకుడిగా నర్సింగ్ రావు నిర్మాతగా నిర్మించబడుతున్న చిత్రం హంట్ (Hunt). ఈ చిత్రం యొక్క మోషన్ టీజర్ ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. అయితే హంట్ అనే పేరుతో హీరో సుధీర్ బాబు చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర వివరాలు తెలియజేయడానికి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్ ఎస్ ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కృష్ణ, హీరో దర్శకుడు నిక్షిత్, డాన్స్ మాస్టర్ బషీర్ మరియు నిర్మాత నర్సింగ్ రావు పాల్గొన్నారు.ఎమ్ ఎస్ ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “మేము హంట్ చిత్రం మోషన్ టీజర్ ను విడుదల చేసాము. షూటింగ్ జరుగుతుంది. మేము హంట్ అనే టైటిల్ ను 6 నెలల క్రితం ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నాము. ఇప్పుడే అదే చిత్ర టైటిల్ తో భవ్య క్రియేషన్స్ వాళ్ళు సుధీర్ బాబు హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు. వాళ్ళు ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు.