కంటెంట్ వీక్.. కలెక్షన్స్ స్ట్రాంగ్.. బాక్సాఫీస్ పై సర్కారువారి దండయాత్ర

కంటెంట్ వీక్ గా ఉన్నా కలెక్షన్స్ వస్తున్నాయంటే.. అది ఆ సినిమాలో ఉన్న కటౌట్ వాల్యూగానే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు రికార్డ్ కలెక్షన్స్ సాధించినా.. బలమైన కథలు మాత్రం కనిపించడం లేదు. అయినా కలెక్షన్స్ వస్తున్నాయంటే ఆ సినిమాలో నటించిన హీరోలే కారణం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. లేటెస్ట్ గా వచ్చిన సర్కారువారి పాట కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఫస్ట్ డే రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ రెండో రోజు కూడా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసింది.
సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే మాస్ తో పాటు క్లాస్ కూడా ఇష్టపడతారు. మన టాప్ స్టార్స్ లో ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న స్టార్ కూడా మహేష్ బాబే అని చెప్పాలి. ఈ ప్రేక్షకులు అతని ప్రతి సినిమానూ చూస్తారు. సినమాకు హిట్ టాక్ వస్తే ఇంక బ్లాక్ బస్టర్ చేసే బాధ్యత వాళ్లే తీసుకుంటారు. కానీ ఫస్ట్ టైమ్ మహేష్ బాబు సినిమాక కాస్త డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అది కూడా వర్కింగ్ డేస్ లో కావడం విశేషం. గురువారం విడుదలైన సర్కారువారి పాట మొదటి రోజు ఏకంగా 36కోట్ల 89లక్షలు షేర్ కలెక్ట్ చేసిన ఓ ప్రాంతీయ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. గ్రాస్ గా చూస్తే మొదటి రోజు 75కోట్లకు పైగా వసూలు చేసినట్టు. ఇప్పటి వరకూ వచ్చిన ప్యాన్ ఇండియన్ సినిమాలతో పోలిస్తే.. ఇది చాలా రెట్లు బెస్ట్ కలెక్షన్ గానే చెప్పాలి.
టాక్ ను బట్టి రెండో రోజుకు డల్ అవుతుందనుకున్నారు చాలామంది. బట్.. సెకండ్ డే కూడా సర్కారువారి పాట సత్తా చాటింది. శుక్రవారం మామూలుగానే చాలా సినిమాలు విడుదలవుతాయి. సర్కారుకు పోటీ లేకపోవడంతో ఫ్రైడే కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. రెండో రోజు ఈ మూవీ సాధించిన కలెక్షన్స్ 11కోట్ల 64లక్షలు షేర్. అంటే ఇది కూడా 25కోట్లు గ్రాస్ గా ఉంటుంది. సింపుల్ గా చెబితే రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓ రకంగా కేవలం తెలుగులో మాత్రమే విడుదలైన సర్కారువారి పాట సాధించిన ఈ కలెక్షన్స్ పెద్ద రికార్డ్ అనే చెప్పాలి.
కథ, కథనాలు ఎలా ఉన్నా.. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు మాస్ హీరోగా అదరగొట్టాడు. కీర్తి సురేష్ తో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటే.. సెకండ్ హాఫ్ లో సీరియస్ కంటెంట్ ను చెప్పే ప్రయత్నం చేశారు. ఇది చాలామందికి రిలేటివ్ గా ఉండటంతో స్క్రీన్ ప్లే గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు ఆడియన్స్ అనుకోవచ్చు. ఇక కళావతి సాంగ్ తో పాటు మమ మహేషా సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఈ కలెక్షన్స్ ను మాత్రం ట్రేడ్ ఊహించలేదు. ఏదేమైనా వసూళ్లు భారీగా ఉండటం మంచిదే కానీ.. కాస్త కంటెంట్ విషయంలో కూడా కాన్ సెం