‘చారి 111‘ ట్రైలర్.. సీక్రెట్ ఏజెంట్ గా వెన్నెల కిషోర్

కమెడియన్స్ హీరోలుగా ఫుల్ లెన్త్ రోల్స్ లో మురిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈకోవలోనే వెన్నెల కిషోర్ ‘చారి 111‘తో హీరోగా అలరించడానికి ముస్తాబయ్యాడు. ‘మళ్ళీ మొదలైంది’ ఫేమ్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని అదితి సోనీ నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్ కి జోడీగా సంయుక్తా విశ్వనాథన్ నటించింది. తాజాగా.. ‘చారి 111‘ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్.

‘బాండ్… జేమ్స్ బాండ్’ టైపులో తనను తాను ‘చారి… బ్రహ్మచారి’ అంటూ ఇంట్రడక్షన్ సీన్ తోనే తనదైన శైలిలో పంచులు పంచుతున్నాడు వెన్నెల కిషోర్. సీరియస్‌గా కనిపిస్తూ నవ్వించే గూఢచారిగా ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇండియా, పాకిస్తాన్ నేపథ్యంతో రాబోతున్న ఈ మూవీని ఆద్యంతం ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్టు ట్రైలర్ ను బట్టే తెలుస్తోంది. మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, ‘తాగుబోతు’ రమేష్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మార్చి 1న ‘చారి 111‘ థియేటర్లలోకి రాబోతుంది.

Related Posts