అతీంద్రయ రహస్యాల నేపథ్యంలో ‘బ్రహ్మయుగం’

మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి అంటేనే ప్రయోగాలకు పెద్ద పీట వేస్తాడు. తన పాత్ర హీరోనా? విలనా? అని ఆలోచించకుండా ఆ పాత్రలో ఇమిడిపోవడమే అతని స్టైలే. అందుకే.. 70 ఏళ్ల వయసులోనూ కుర్రా హీరోలకు మించిన రీతిలో సినిమాల స్పీడు చూపిస్తున్నాడు. ఇక.. మమ్ముట్టి లేటెస్ట్ మూవీ ‘బ్రహ్మయుగం’. ఫిబ్రవరి 15న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘బ్రహ్మయుగం’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్.

పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో హారర్ థ్రిల్లర్ గా రాహుల్ సదాశివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీని బ్లాక్ అండ్ వైట్ లో తెరకెక్కించడం విశేషం. ఈ సినిమాలో మమ్ముట్టి విలన్ గా కనిపించాడట. హీరోగా అర్జున్ అశోకన్ నటించాడు. ‘ఇవి పావులు.. ఇవి రెండు పాచికలు పడ్డ సంఖ్యను బట్టి.. పావుని జరపాలి. ముందు ఇక్కడికి చేరిన వాళ్లు గెలిచినట్లు అర్థం. దానికి భాగ్యం ఉండాలి’ అంటూ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అయితే.. అసలు ఈ కథ ఏంటి? అనే దానిపై ట్రైలర్ ను ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరి.. ఈ ‘బ్రహ్మయుగం’లో ఎలాంటి కంటెంట్ దాగుందో తెలియాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే.

Related Posts