మాస్ మహారాజాకి బర్త్ డే విషెస్

లక్ష కేలరీల ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్.. వెయ్యి వాట్ల ఓల్టేజికి ట్రాన్స్‌ ఫార్మర్.. ఫుల్ రేంజ్ పవర్‌ కి జనరేటర్. తన బలుపుతో బాక్సాఫీసు బద్దలుగొట్టే బాక్సర్. సిల్వర్ స్క్రీన్‌ పై మెరుపులు మెరిపించి ఘాటు పుట్టించే మిరపకాయ్.. ఎమోషనల్ యాక్షన్‌తో దుమ్ము రేపే లోకల్ రాజా.. కామెడీతో ఫుల్లు కిక్కిచ్చే మాస్ మహారాజా.. అతనే మన ఫేవరెట్ రవితేజ.. జనవరి 26 రవితేజ పుట్టినరోజు.

రవితేజ… బిగ్ స్క్రీన్ మీద కనిపించాడంటే చాలు.. గ్లూకోన్‌ డీ అవసరం లేదు.. ఫ్రూట్ జ్యూస్ అసలక్కర్లేదు.. ఆటోమేటిగ్గా ఎనర్జీ తన్నుకుంటూ వచ్చేస్తుంది. రెక్లెస్ గా చూసే చూపులు.. తిక్క తిక్కగా ఉండే మాటలు.. రివర్స్‌ గేర్‌ లో వచ్చే దూకుడు.. అన్నీ పక్కా లోకల్ కుర్రాడిలా కనపడే రవితేజను కుర్రకారు ఫుల్లు ఫాలో అయిపోతారు. రఫ్‌ గా కనపడుతూ.. ఎవడైతే నాకేంటన్నట్లు రఫ్ఫాడించే రవితేజను చూసి.. ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ పదకొండేళ్లపాటు స్టూడియోల చుట్టూ అలసట లేకుండా తిరిగాడు. ముందు ఒక్క నిముషం కనపడ్డాడు. ఆ నిమిషం కనపడటానికే నానా కష్టాలు పడ్డాడు. తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న క్యారెక్టర్లు సంపాదించాడు. ఇరవయ్యేళ్ల వయసులో అడుగు పెట్టి.. ముప్ఫై నాలుగేళ్ల వయసులో హీరోగా బ్రేక్ సాధించాడు. కృష్ణవంశీ తీసిన ‘సింధూరం’లో సెకండ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా… శ్రీనువైట్ల తీసిన ‘నీ కోసం’ మూవీతో మంచి పేరును సంపాందించుకున్నాడు. ఇక పూరీతో చేతిలో పడ్డాక పక్కా మాస్‌గా మారిపోయిన రవితేజ.. అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడినే కాదు.. సీరియస్ యాక్షన్ కూడా చేయగలనని నిరూపించుకున్నాడు.

హీరో అవటానికి పదకొండేళ్లు కష్టపడ్డాడు. కాని ఐదే ఐదేళ్లు. ఆ ఐదేళ్లలో టాప్‌హీరో‌ల్లో ఒకడు అయిపోయాడు. టాప్ డైరెక్టర్లకు వాంటెడ్ హీరో అయ్యాడు. మినిమమ్ గ్యారంటీ కలెక్షన్స్‌తో అసలు సిసలు మాస్ మహారాజాగా టాలీవుడ్‌లో హిస్టరీ క్రియేట్ చేశాడు. ఫ్లాపులొచ్చినా.. టాప్‌ లేపే మరో హిట్‌తో మొత్తం కవర్ చేసే టెక్నిక్‌తో నాన్‌ స్టాప్ ఎంటర్‌ టైన్ ‌మెంట్స్‌ ని అందిస్తున్నాడు రవితేజ. వరుస డిజాస్టర్లు పలకరించినా.. ఏ మాత్రం బెదరకుండా… మళ్లీ ఫామ్ లోకి వచ్చి… దటిజ్ రవితేజ అని ఇండస్ట్రీ చెప్పుకునేలా చేస్తుంటాడు. ఫిబ్రవరిలో ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ.. ఆ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘మిస్టర్ బచ్చన్’ని రెడీ చేస్తున్నాడు

Related Posts