యాటిట్యూడ్ కీ, అతికీ తేడా ఇప్పుడు తెలుస్తోందా విజయ్ ..?

విజయ్ దేవరకొండ.. నటుడుగా వెండితెరపై మంచి ప్రతిభావంతుడు. కానీ వేదికలపైనే అతివంతుడుగా కనిపిస్తాడు. అది తన యాటిట్యూడ్ అని చెప్పుకున్నా.. ఒక్కోసారి పబ్లిక్ సెక్టర్ లో అది అతిగానే కనిపిస్తుంది. ఎంత యాటిట్యూడ్ కైనా ఓ లిమిట్ ఉంటుంది. అది దాటితే అభిమానించేవాళ్లు కూడా సైలెంట్ గా తప్పుకుంటారు. విజయ్ దేవరకొండ విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. తన లైగర్ సినిమా ప్రమోషన్స్ లో అతను చెప్పిన డైలాగులు, చేసిన చేష్టలు ఇప్పుడు సెటైర్స్ గా మారాయి. నిజానికి లైగర్ విషయంలో టాలీవుడ్ నుంచి విజయ్ కి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదు. కనీసం రూమర్స్ కూడా రాలేదు. అయినా అతను ఓ సారి ” మా తాతెవరో తెలియదు, నా తండ్రెవరో తెలియదు.. అయినా నన్ను అభిమానిస్తున్నారు”.. అంటూ ఇన్ డైరెక్ట్ గా నెపోటిజంపై కమెంట్స్ చేశాడు. ఇప్పుడు అతనికి అవి రివర్స్ అయ్యాయి. లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా తేలింది. ఎవరి సినిమా అయినా బావుంటేనే చూస్తారు తప్ప వారసులు కాబట్టి మోయరు కదా.. మరి ఇప్పుడు చెప్పు నీ తాత, తండ్రి గురించి అంటూ కమెంట్స్ చేస్తున్నారు.
ఇక ఓ సారి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ.. ఓ జర్నలిస్ట్ మీరు ఇంతకు ముందులా ఫ్రీగా లేరు అన్నాడు. ఆ వెంటనే నీ యమ్మ(బూతు కాదు తన స్టైల్లో క్యాజువల్ గానే అన్నాడు).. అదేం లేదు భయ్యా.. ఏం అడుగతరో అడగండి రెండు కాళ్లూ ముందు టేబిల్ పై పెట్టాడు. ఆ సందర్భంలో అదేం పెద్ద తప్పుగా ఏ జర్నలిస్ట్ కూ కనిపించలేదు. బట్ నెటిజన్స్ ఆడుకున్నాడు. దానికి వివరణ ఇవ్వడానికి పి.ఆర్ టీమ్ నానా తంటాలు పడింది. చివరికి అక్కడి జర్నలిస్ట్ లతోనే వీడియోస్ చేయించి మరి సోషల్ మీడియాలో వివరణ ఇప్పించింది. బట్ ఒక్కసారి డామేజ్ జరిగితే అంత త్వరగా సెట్ అవదు కదా..? ఇవన్నీ కలిసి ఇప్పుడు లైగర్ సినిమాపై మరింత పెద్ద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ తన సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా గౌరవంగా భావించిన యాటిట్యూడ్ అనే మేటర్ నెగెటివ్ వే లో ప్రెజెంట్ అయింది. అది సినిమాతో పాటు ఇమేజ్ నూ డామేజ్ చేస్తుంది. లేదంటే సినిమా పోగానే అంతా కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడతారు తప్ప.. ఇతని యాటిట్యూడ్ గురించి కాదు. అందుకే పదిమందిలో ఉన్నప్పుడు ఎ