బన్నీ చెప్పిన‌ట్టుగానే.. ఎక్క‌డా త‌గ్గ‌లేదుగా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ అంచ‌నాలతో రూపొందిన పుష్ప చిత్రానికి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో అని అంతా ఆతృత‌గా ఎదురు చూశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్ దగ్గర చూసినా ఈ సినిమాకి సంబంధించిన సందడే కనిపించింది. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఈ సినిమాకి టికెట్లు దొరకడమే కష్టమైపోయింది. దీనిని బట్టి అర్థం చేసుకోవ‌చ్చు పుష్ప‌కి ఎంత క్రేజ్ ఉందో.

ఈ సినిమా చూసిన వాళ్లంద‌రూ చెప్పిన ఒకే మాట బ‌న్నీ ఓన్ మేన్ షో. ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కానీ.. పాత్ర స్వ‌భావాన్ని అర్థం చేసుకుని న‌టించి అంద‌రి మ‌న‌సులు దోచుకున్నాడు బ‌న్నీ. అంత‌లా పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఎలాంటి ప్రేమానురాగాలకి నోచుకోకుండా పెరిగిన ఒక వ్యక్తి ఎలా మారతాడు.? అడవిలో మృగాల్లాంటి మనుషుల మధ్య ఎలాంటి తెగువ చూపిస్తాడు.? శ్రీవల్లి రూపంలో తనకి దొరికిన కొద్ది పాటి ప్రేమలోనే మరో ప్రపంచాన్ని ఎలా సృష్టించుకున్నాడు.? ఇలా ప్రతి అంశాన్ని ఆయన జీర్ణించుకుని తెర పైన ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకుల నుంచి విజిల్స్ పడుతున్నాయి.

ఇక క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. చెప్పిన‌ట్టుగానే ఎక్క‌డా త‌గ్గేదేలా అన్న‌ట్టుగా రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో కూడా రికార్డ్ క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. ఫ‌స్ట్ వీకెండ్ లోనే స‌రికొత్త రికార్డ్ సృష్టించ‌డం ఖాయం అంటున్నారు సినీ జ‌నాలు. మ‌రి.. ఫుల్ ర‌న్ లో పుష్ప న్యూ రికార్డ్ సెట్ చేస్తాడేమో చూడాలి.

Related Posts