నిఖిల్ ను నిండా ముంచుతూ సెంటిమెంట్ అంటున్నారే..

కొన్ని సినిమాలు అనుకున్న డేట్ కు రిలీజ్ కావు. పోస్ట్ పోన్ అవడమో లేక ప్రీ పోన్ అవడమో జరుగుతుంది. అందుకు చాలా కారణాలుంటాయి. అయితే ఒకే హీరో సినిమా ఇలా ప్రతీసారీ పోస్ట్ పోన్ కావడం మాత్రం అరుదు. ఆ అరుదైన తెలుగు హీరో నిఖిల్. గతంలో అతను అర్జున్ సురవరం అనే సినిమా చాలాసార్లు వాయిదా పడింది. బట్ లేట్ గా వచ్చినా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కార్తికేయ2 విషయంలోనూ అది మరోసారి జరుగుతోంది. అంటే ఇది కూడా హిట్ అనుకోవాలా లేక.. ఈ వాయిదాల వెనక ఇంకెవరిదైనా హస్తం ఉందనుకోవాలా..?


2014లో వచ్చిన సూపర్ హిట్ మూవీ కార్తికేయకు సీక్వెల్ గా వస్తోన్న చిత్రమే కార్తికేయ2. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని కూడా చందు మొండేటి డైరెక్ట్ చేశాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ మూవీని గత నెల 22న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత ఆగస్ట్5న విడుదల అని ప్రకటించారు. కానీ ఏమైందో మళ్లీ నెక్ట్స్ వీక్ కు వెళ్లారు. ఆగస్ట్ 12న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ నెల 11న చిరంజీవి సమర్పణలో వస్తోన్న లాల్ సింగ్ చడ్డా, 12న నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇదేమంత పెద్ద పోటీ కాదు కాబట్టి నిఖిల్ కు ఇబ్బంది ఉండదు అనుకున్నారు. కానీ అతను తన సినిమా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందని చెబుతూ వాపోతున్నాడు.

నిఖిల్ కార్తికేయ2 పోస్ట్ పోన్ అంటే మరీ చాలా దూరం వెళ్లలేదు తాము అనుకున్న డేట్ నుంచి ఒక రోజు ముందుకు వెళ్లారు. అంటే 13న రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ డే క్లాషెస్ లేకుండా ఉండేందుకే ఈ వాయిదా అన్నారు కానీ.. కావాలనే కొందరు పెద్దలు కార్తికేయ2ను పోస్ట్ పోన్ చేయించారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఆ పెద్దలెవరు అనేది ఆడియన్స్ ఊహలకే వదిలేయాలి. అయితే అర్జున్ సురవరం విషయంలో కూడా ఇలాగే వాయిదాల పర్వం కొనసాగింది. అయినా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందనీ సరిపెట్టుకుంటోంది టీమ్. ఇక శ్రీ కృష్ణజన్మస్థానం ద్వారక నేపథ్యంలో సాగే డ్రామ