కనీవినీ ఎరుగని రీతిలో అనంత్-రాధిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్

ధనవంతుల వివాహ వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో తెలుసుకోవాలంటే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి హడావుడి చూస్తే అర్థమవుతోంది. అనంత్, రాధిక ల నిశ్చితార్థం గత సంవత్సరం జనవరి 19న ముంబైలో జరిగింది. ఆ తర్వాత గత డిసెంబర్ లో వీరి వివాహ రోకా వేడుకను రాజస్థాన్‌లోని నాథ్‌ ద్వారా లోని శ్రీనాథ్‌ జీ ఆలయంలో జరిపారు. ఇక.. ఈ ఏడాది మార్చి 1 నుంచి 3 వరకూ అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి.

గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగే ఈ ప్రీ వెడ్డిండ్ సెలబ్రేషన్స్ కు అతిథుల లిస్ట్ మామూలుగా లేదు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుమారుడి వివాహం ఏ రేంజులో జరుగుతుందో.. అందుకు తగ్గట్టే అంర్జాతీయంగా ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు హాజరుకాబోతున్నారు. ఈ గెస్ట్స్ లిస్ట్ లో గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచ్చయ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, మెటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్, అడోబీ సీఈవో శాంతను నారాయణన్, డిస్నీ సీఈవో బాబ్ ఐగర్ వంటి ఇంటర్నేషన్ బిజినెస్ టైకూన్స్ ఉన్నారు. ఇంకా.. ఇంటర్నేషనల్ గా ఎంతోమంది బిజినెస్ టైకూన్స్ తో పాటు.. ఇండియాలోని ధనవంతులంతా ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు హాజరుకానున్నారట. ఫిల్మ్, క్రికెట్ సెలబ్రిటీల సంగతైతే చెప్పక్కర్లేదు.

అలాగే.. అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు ఈ వేడుకలో ప్రదర్శనలు ఇవ్వనున్నారట. రిహాన్న, డేవిడ్ బ్లెయిన్ వంటి అంతర్జాతీయ కళాకారులతో పాటు.. అర్జిత్ సింగ్, అజయ్-అతుల్, దిల్జిత్ దోసాంజ్ వంటి భారతీయ అగ్రశ్రేణి కళాకారులు వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పెర్ఫామ్ చేయనున్నారట. ఇక.. మార్చి 1 నుంచి 3 వరకూ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగితే.. జూలై 12న అనంత్-రాధిక వివాహం జరగనుంది.

Related Posts