బాలకృష్ణకు కలిసొచ్చిన అల్లు ఫ్యాక్టర్

చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువ. సినిమా ప్రారంభంలో కొట్టే కొబ్బరికాయ నుంచి సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత కొట్టే గుమ్మడికాయ దాకా సెంటిమెంట్ లతోనే పనంతా. అదృష్టాన్ని బాగా నమ్మే ఈ ఇండస్ట్రీలో…కొన్ని కాంబినేషన్స్ బాగా కలిసొస్తుంటాయి. ఇటీవల బాలకృష్ణ అల్లు కాంపౌండ్ లో అడుగు పెట్టారు. వెంటనే అఖండ లాంటి బిగ్ హిట్ ఆయన ఖాతాలో పడింది. రంగులు, ముహూర్తాలు, చిహ్నాలు, సూచనలు, తిథులు ఇవన్నీ నమ్మే బాలకృష్ణ లాంటి స్టార్ ..ఈ కలిసొచ్చిన అంశాన్నీ సులువుగా మర్చిపోతారని అనుకోలేం. అల్లు ఫ్యాక్టర్ బాలకృష్ణకు కలిసొచ్చిన అంశమని ఆయనతో సహా ఇప్పుడు అంతా చెప్పుకుంటున్న విషయం. ప్రస్తుతం బాలకృష్ణ అల్లు వారి ఆహా ఓటీటీ లో ఎన్ బీకే అన్ స్టాపబుల్ అనే ప్రోగ్రాం చేస్తున్నారు. ఈ ఛాట్ షో ఓటీటీ వ్యూస్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. బాలకృష్ణ ఛిట్ ఛాట్ ప్రోగ్రాం ఎలా చేస్తాడో అని సందేహించిన వారంతా అన్ స్టాపబుల్ ప్రోగ్రాం హిట్ తో…అంతటి స్టార్ హీరో కూడా యాంకర్ గా మెప్పించగలరు అని ఒప్పుకున్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబ నిర్మాణ సంస్థ. ఈ సంస్థలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలుగా సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. అలాంటి గీతా ఆర్ట్స్ లో బాలకృష్ణ సినిమా వస్తుందనే న్యూస్ టాలీవుడ్ లో సర్ ప్రైజ్ న్యూస్ అయ్యింది. భిన్న ధృవాల్లాంటి బాలకృష్ణ, చిరంజీవి నేపథ్యాలు, ఫ్యాన్ బేస్ లు, కుటుంబాలు, వాటి మధ్య ఉన్న దూరం అందరికీ దశాబ్దాలుగా తెలిసిందే. ఫంక్షన్స్ లో ఫార్మల్ గా కలిసినా మెగాస్టార్, బాలకృష్ణ మధ్య దూరం కనిపించని తెరలా ఉండిపోయింది. మొన్న మా ఎలక్షన్స్ సందర్భంలోనూ ఇది స్పష్టంగా తెలిసిపోయింది. ఆ పరిస్థితుల్లో గీతా ఆర్ట్స్ లో బాలకృష్ణ సినిమా చేస్తారన్న అనౌన్స్ మెంట్ ఆశ్చర్యమే. ఆహాలో బాలకృష్ణ షో చేయడంతో సినిమా కూడా చేయొచ్చు అని అంతా నమ్మారు. అల్లు కాంపౌండ్ లోకి బాలకృష్ణ అడుగు పెట్టడం అఖండ విజయంతో శుభసూచకమే అని అర్థమవుతోంది.

అఖండ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. బోయపాటితో అల్లు అర్జున్ కున్న సరైనోడు సక్సెస్ అనుబంధంతో పాటు ఆహాలో బాలకృష్ణ ప్రోగ్రాం చేసిన సాన్నిహిత్యం కూడా అఖండ ప్రచారంలో అల్లు అర్జున్ పాల్గొనేలా చేసింది. ఇలా కూడా అల్లు వారి సక్సెస్ ట్రాక్ బాలకృష్ణకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా కలిసొచ్చి ఉండొచ్చు. అఖండ విజయంలో తానూ ఓ చిన్న పార్ట్ అయినందుకు అల్లు అర్జున్ ఇంట్లో అఖండ సక్సెస్ సంబరాలు జరిగాయి. బోత్ ఆర్ నాట్ సేమ్ అనుకునే బాలకృష్ణ, అల్లు ఉరఫ్ మెగా ఫ్యామిలీలు ఇలా ఒకరి సక్సెస్ ను మరొకరు సెలబ్రేట్ చేసుకోవడం ఇండస్ట్రీకీ సానుకూల అంశమే.

అఖండ సక్సెస్ ను మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఓన్ చేసుకోవడం వీళ్ల మధ్య బంధాన్ని మరింత దగ్గర �