ఆచార్య కథేంటీ..? రామ్ చరణ్ పాత్ర ఎలా చనిపోతుంది..?

ఏ పరిశ్రమలో అయినా ఓ స్టార్ హీరో అతని కొడుకుతో కలిసి నటిస్తున్నాడు అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇక తనతో పాటు తనయుడూ స్టార్ అయిన తర్వాత కలిసి నటిస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్ షేక్ అయ్యే కంటెంట్ తోనే వస్తారు కదా.. అలాంటి కంటెంట్ ఉందా లేదా అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు తెలుగులో వస్తోన్న ఆచార్య మాత్రం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది. మెగాస్టార్, మెగాపవర్ స్టార్ కలిసి నటించిన సినిమా కావడంతో అందర్లోనూ ఓ రకమైన క్యూరియాసిటీ కనిపిస్తోంది. మరి ఇంత క్యూరియస్ ను క్రియేట్ చేసిన ఈమూవీ కథేంటీ అంటే ఓ ఆసక్తికరమైన కథ వినిపిస్తోంది.
ఆచార్య.. కథగా చెబితే.. చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్స్ గా ఉంటారు. ఇద్దరూ కలిసి ఓ భారీ ఎన్ కౌంటర్ లో కూడా పాల్గొంటారు. ఆ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా ఉంటుందట. అయితే చిరంజీవికి శిష్యుడుగా మసలే చరణ్ పాత్ర తన ఊరు.. ధర్మస్థలి గురించి అక్కడి అక్రమాల గురించి తరచూ చిరంజీవికి చెబుతుంటాడు. ఆ క్రమంలో ఓ సారి సొంతూరికి వెళ్లిన చరణ్ ను అక్కడే కొందరు గూండాలు చంపేస్తారు. ఈ విషయం తెలియని చిరంజీవి తన శిష్యుడుని వెదుక్కుంటూ వస్తాడు. అయితే అతన్ని కొందరు చంపేశారు అని తెలిసిన తర్వాత అతని ఆశయమైన ధర్మస్థలిని కాపాడే బాధ్యత ఈయన తీసుకుంటాడు.. మరి ఆ తర్వాత ఎలా ఆ స్థలాన్ని కాపాడాడు అనేది మిగతా కథగా ఉంటుంది. అక్కడ ఉన్నది మెగాస్టార్ కాబట్టి.. అదేమంత కష్టం కాదు. ఇదీ స్థూలంగా ఆచార్య కథ.. అని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.


ఇక సినిమాలో ఎన్ కౌంటర్ తో పాటు రామ్ చరణ్ ను చంపేసే పాత్ర చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కిస్తుందట. ఆ సీన్ కోసమే రిపీటెడ్ ఆడయన్స్ వస్తారు.. అనేది మేకర్స్ నమ్మకం. అలాగే తన శిష్యుడు మరణం గురించి తెలుసుకున్న చిరు.. ఒక్కసారిగా రౌద్రరూపం దాల్చడం ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్ కు గూస్ బంప్స్ గ్యారెంటీ అంటున్నారు.. దీనికి మణిశర్మ నేపథ్య సంగీతం ఎంత హెల్ప్ అయి ఉంటుంది అనేది ఈ నెల 29న రాబోతోన్న ఆచార్య చూస్తే కానీ తెలియదు.. మొత్తంగా కథ ఇదే అయితే మాత్రం ఏమంత గొప్ప ఎగ్జైటింగ్ పాయింట్ కాదు. కానీ ఇప్పుడు దేశమంత