ఆచార్య కు బజ్ రావడం లేదని మెగా మథనం

మెగాస్టార్ చిరంజీవి నుంచిఓ సినిమా వస్తోందంటే ఒకప్పుడు ఎంత హంగామా ఉండేదో చెప్పలేం. ఇంకా ఓ రెండు దశాబ్దాల క్రితం అయితే అదో పండగ అన్నట్టుగా చూశారు అభిమానులు ప్రేక్షకులు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆయన స్థానంలో రామ్ చరణ్ వచ్చాడు. అతనూ తనదైన రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. మెగా తనయుడు అన్న ట్యాగ్ ను దాటుకుని మరీ దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. పైగా రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ తో అద్భుత విజయం అందుకున్నాడు. మరి ఇలాంటి ఇద్దరు హీరోల కాంబినేషన్ లో సినిమా వస్తోందంటే ఏ రేంజ్ లో హడావిడీ ఉండాలి. కానీ అదేం కనిపించడం లేదు. మామూలుగా వీరి సినిమాలు వస్తున్నప్పుడు సోషల్ మీడియాలో కూడా సందడి కనిపిస్తుంది. కానీ ఈ సారి అదేం లేదు. ఓ రకంగా ఆచార్యకు వాళ్లు ఊహించినంత బజ్ ఇప్పటి వరకూ క్రియేట్ కాలేదు. రీసెంట్ గా జరిగి ప్రీ రిలీజ్ ఫంక్షన్ సైతం ఆచార్యకు బూస్టప్ ఇవ్వలేకపోయిందనేది నిజం. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదట. దీంతో అసలేం జరుగుతుందా అని మెగా క్యాంప్ లో మథనం మొదలైందంటున్నారు.
ఇక అప్పటి స్టార్స్ లో ఇప్పటికీ మిడ్ నైట్ స్టార్స్ లో బెన్ ఫిట్ షోలు, ప్రీమియర్స్ పడేది కేవలం చిరంజీవి, బాలయ్య సినిమాలకే. అయితే ఆచార్యకు ఆ ఊపు కనిపించడం లేదు అనేది వాస్తవం. అసలు ప్రీమియర్స్ ఉంటాయా అనే అనుమానాలు కూడా అభిమానుల్లో మొదలయ్యాయి. అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే డౌట్స్ కూడా కొందరిలో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఆచార్య ప్రమోషనల్ గా ఎంత వీక్ గా ఉందో. రెండు రోజుల నుంచి కంటిన్యూస్ గా మూవీ టీమ్ అంతా ఇంటర్వ్యూలు ఇస్తోంది. కానీ.. అవన్నీ సొంత భజనల్లాగే కనిపిస్తున్నాయి. అన్ని ఇంటర్వ్యూస్ లోనూ అవే డైలాగులు రిపీట్ అవుతున్నాయి. అంటే డాడీ బాగా చేశాడని చరణ్.. చరణ్ నన్ను డామినేట్ చేయలేడని చిరంజీవి.. ఇలా ఇదేదో ఫ్యామిలీ యవ్వారంలా కనిపిస్తుందే తప్ప.. సినిమా గురించి మాట్లాడ్డం కానీ.. ఆ చిత్రం పై అంచనాలు పెంచే మాటలు కానీ వినిపించడం లేదు. దీనికి తోడు కాజల్ కూడా సినిమా నుంచి అవుట్ అయిపోయిందనే వార్తలూ.. మైనస్ గా మారాయి. ఏదేమైనా ఆచార్యపై అంచనాలు పెరగడం లేదు. ఆశించినంత బజ్ రావడం లేదని సినిమా టీమ్ కూడా ఫీలవుతోంది. విడుదలకు ఇక నాలుగు రోజులే టైమ్ ఉంది. మరి ఈ నాలుగు రోజుల్లో ఇంకేదైనా చేస్తారా అనేది చూడాలి. బ