సినిమా క్రిటిక్స్ ను చంపేస్తున్న సీరియల్ కిల్లర్

ఏదైనా సినిమా విడుదలైన ప్రతి ఒక్కరూ ఎదురుచూసేది తమకు నచ్చినవారు ఇచ్చే రివ్యూస్ కోసం. ఆ రివ్యూస్ ను బట్టే సినిమాల రెవిన్యూస్ డిపెండ్ అవుతాయి. అందుకే రివ్యూస్ అన్నా రివ్యూవర్స్ అన్నా సినిమా పరిశ్రకు చాలా కోపం. ఒకప్పుడంటే వారం తర్వాత పత్రికల్లో సినిమా రివ్యూస్ వచ్చేవి. కానీ ఇప్పుడు నిమిష నిమిషానికి అప్డేట్ ఇస్తూ సెల్ ఫోన్స్ లోనే రివ్యూస్ రాసేస్తున్నారు కొందరు. వీరిలో చాలామంది ట్విట్టర్ లో అప్డేట్స్ పెడుతూ అసలు సినిమా కూడా సరిగా చూడరు. ఇలాంటివైతే ఖచ్చితంగా ఖండించాల్సిందే. అయితే అది మాటల్లో ఉండాలి కానీ మర్డర్స్ లో చేస్తున్నాడో వ్యక్తి. యస్.. ఇలా సినిమాలకు రివ్యూస్ రాస్తూ రేటింగ్స్ ఇచ్చేవారిని వరుసగా చంపేస్తూ..

వారు ఇచ్చిన రేటింగ్స్ నే చంపిన తర్వాత మొహాలపై చెక్కుతూ అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. మరి అతన్ని పట్టుకోవడానికే మన సన్నిడియోల్ వెదుకుతున్నాడు. సినిమా హీరో సన్నీ డియోల్ ఎందుకు వెదుకుతాడు అనుకుంటున్నారా..? వెదుకుతాడు.. ఎందుకంటే ఇదంతా కూడా ఓ సినిమాలోని కథే కాబట్టి. ఆ సినిమా పేరు చుప్(Shut Up). విశేషం ఏంటంటే ఈ చిత్రంలో హీరో దుల్కర్ సాల్మన్. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది.

రీసెంట్ గా సీతారామంతో తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకుని.. అదే చిత్రం హిందీ డబ్బింగ్ తోనూ హిట్ తెచ్చుకున్న దుల్కర్ గతంలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. బట్ ఈ మూవీ చూస్తోంటే కాస్త ప్రామిసింగ్ గా ఉంది. దుల్కర్ సరసన శ్రేయా ధన్వంతరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మొన్నటి తరం గ్లామర్ క్వీన్ పూజాభట్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తోంది. దుల్కర్ సినిమా మేకర్ గా నటిస్తున్నాడు. అతనితో పాటు తను తీసే ఇతర సినిమాలపై తీవ్రమైన విమర్శలు చేస్తూ తక్కువ రేటింగ్స్ ను ఇచ్చే విమర్శకులను ఓ సీరియల్ కిల్లర్ చంపేస్తుంటాడు. అతనెందుకు అలా చేస్తున్నాడు. సినిమా బాలేందంటేనే చంపేస్తారా..? ఈ సీరియల్ కిల్లర్ కు ఇంకేదైనా మోటివ్ ఉందా అనే కోణంలో సన్నిడియోల్ ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంటుంది.మొత్తంగా ఈ ట్రైలర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద బాలీవుడ్ అయింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts