ఫ్యామిలీ ఎమోషన్ & ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ మూవీ

ఈ నెల 16న గ్రాండ్ గా 550 థియేటర్స్ లలో విడుదల అవుతున్న “నేను మీకు బాగా కావాల్సినవాడిని”.రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కున్న హీరో కిరణ్ అబ్బ‌వ‌రం నటిస్తున్న తాజా సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ‘SR కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత..

అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇందులో హీరో కిరణ్ అబ్బ వరం కొత్తగా కనిపించనున్నాడు.ఈ మద్యే చిత్ర ట్రైలర్‌ను పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ విడుదల చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ఫాదర్ గా దర్శక, నిర్మాత ఎస్. వి కృష్ణారెడ్డి గారు నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 16న గ్రాండ్ గా ఇండియా వైడ్ గా 550 పైచిలుకు థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర హీరో కిరణ్ అబ్బవరం పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

దర్శకుడు కోడి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి పెరిగాను .ఆయనతో పనిచేసే అవకాశం దొరకపోయినా తన కూతురు కోడి దివ్య దీప్తి గారితో పని చేయడం ఆనందంగా ఉంది.అలాగే నేను నటించిన ఈ సినిమా ట్రైలర్‌ ను పవన్ అన్న లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ పవన్‌ సార్‌ మన అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా ఉంటుంది.కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తో తెరకెక్కిన ఈ సినిమాలో అండర్‌ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్‌ పాయ