క‌ళ్యాణ్ రామ్‌గారు పై న‌మ్మ‌కంతో ‘బింబిసార’ వంటి గొప్ప సినిమాను తీసే అవకాశాన్ని ఇచ్చారు : దర్శ‌కుడు వ‌శిష్ట్‌

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టు గుడ్ క్యాప్ష‌న్. వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 5న ఈ మూవీ గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా దర్శ‌కుడు వ‌శిష్ట సినిమా గురించి విశేషాల‌ను తెలియ‌జేశారు.

  • 2018లో ‘బింబిసార‌’ జ‌ర్నీ ప్రారంభ‌మైంది. సాధార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల్లో ఏదో కాలంలోకి వెళ్లిన‌ట్లు చూపించారు. కానీ ఇదే కాలానికి చెందిన ఓ రాజు మ‌రో పీరియడ్‌లోకి వ‌స్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో నుంచే ‘బింబిసార‌’ క‌థ పుట్టింది.
  • క‌థంతా ఓ ఫార్మేట్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత క‌ళ్యాణ్‌గారికి ‘మిమ్మ‌ల్ని ఓసారి క‌ల‌వాల‌ని అనుకుంటున్నాను’ అంటూ మెసేజ్ పంపాను. ప‌టాస్ సినిమా నుంచి ఆయ‌త‌నో ట్రావెల్ ఉంది. మెసేజ్ చూసుకున్న ఆయ‌న క‌లిశారు. నేను చెప్పిన పాయింట్ బాగా న‌చ్చేసింది. రెండు, మూడు రోజుల్లో క‌లుద్దామ‌ని అన్నారు. అప్పుడు నిర్మాత హ‌రిగారికి క‌థ నెరేట్ చేశాను. ఆయ‌న‌కు న‌చ్చింది. త‌ర్వాత సినిమా ఎలా ముందుకెళ్లింద‌నేది అంద‌రికీ తెలిసిందే.
  • తొలి సినిమాను డైరెక్ట్ చేసినా నా స‌బ్జెక్ట్‌పై న‌మ్మ‌కం. దాన్నే క‌ళ్యాణ్‌రామ్‌గారు, హ‌రిగారు న‌మ్మారు. బింబిసార వంటి గొప్ప అవ‌కాశాన్ని ఇచ్చారు. వారు నాకు ఇచ్చిన అవ‌కాశాన్ని నిల‌బెట్టుకోవ‌టానికి ఎంత క‌ష్ట‌ప‌డాలో అంతా క‌ష్ట‌ప‌డ్డాను. నాకు టీమ్ కూడా బాగా స‌పోర్ట్ చేసింది. కెమెరామెన్ ఛోటాగారు, ఆర్ట్ డైరెక్ట‌ర్ కిర‌ణ్‌గారు, ఫైట్ మాస్ట‌ర్ ఇలా అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌గ‌లిగాం.
  • నాకు ముందు నుంచి డైరెక్ష‌న్ అంటేనే ఇష్టం. అయితే మ‌ధ్య‌లో ప్రేమ లేఖ రాశా అనే సినిమాలో హీరోగా న‌టించాను. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. చివ‌ర‌కు నాకు వ‌చ్చిన‌, న‌చ్చిన ప‌న